»   » నా కళ్ళు చెమ్మగిల్లాయి: పూరీ ఫొటో చూసి అభిమాని ఆవేదన, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా అభిమాని పోస్టు

నా కళ్ళు చెమ్మగిల్లాయి: పూరీ ఫొటో చూసి అభిమాని ఆవేదన, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా అభిమాని పోస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చి టాలీవుడ్ లో టాప్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలబడ్డ ఒక మొండి కుర్రాడు. ఇంకా మూస పద్దతిలోనే ఉన్న టాలీవుడ్ హీరోని ఒక సూపర్ మ్యాన్‌ని చేసి, కండలు పెంచి యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా చేసిన మంత్రగాడు. పూరీ ఒక డైరెక్టర్ మాత్రమే కాదు పడిలేచి, కుప్ప కూలినా మళ్ళీ ఎగసిన ఒక యారోగెంట్ యంగ్ మ్యాన్.... నిజానికి పూరీకి వివాదాలు కొత్త కాదు.., పీకలదాకా తెచ్చుకున్న కష్టాలూ కొత్తకాదు. ఇప్పటికీ ఇండస్ట్రీ లో పూరీ జగన్నాధ్ అంటే శత్రువులు కూడా చాటుగా మెచ్చుకునే గర్విష్టి.... కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణ పూరీ ని దెబ్బ తీయక పోవచ్చు.. మనొడికి ఇది చిన్న షాక్ మాత్రమే కానీ పూరి అభిమానులు మాత్రం గట్టిగానే దెబ్బ తిన్నారు. వీధికో బెల్టు షాప్ పెట్టుకున్న ఈ సమాజం జగన్‌ని మాత్రం ఏ నైతికత తో విమర్శిస్తుందీ..? అంటూ ఆయనకు మోరల్ మద్దతు గా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువలా వచ్చిపడుతూనే ఉన్నాయి....

పూరీ విచారణ జరుగుతున్నంతసేపూ

పూరీ విచారణ జరుగుతున్నంతసేపూ

పూరీ జగన్నాథ్ ని విచారించింది "సిట్" ఆ విచారణ జరుగుతున్నంతసేపూ కూడా ఒక్కో చానెల్ ఒక్కో ఊహా జనిత ప్రోగ్రాం ని తయారు చేసిందంటూ విమర్శలూ వచ్చాయ్.... కానీ ఎక్కువమంది అవే కార్యక్రమాలు చూసారన్నది నిజం. మిగతా అందరు నిందితులూ ఒకెత్తూ. పూరీ పై ఆరోపణలు రావటం ఒకెత్తు. అయితే ఇక్కడ అభిమానులు సమర్థించటం అనేది కామన్ అయినా. వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు మాత్రం నిజాలని కలుపుకొనే ఉంటున్నాయి.

నా కళ్ళు చెమ్మగిల్లాయి

నా కళ్ళు చెమ్మగిల్లాయి

అయితే ఇక్కడ అసలు డ్రగ్స్ ని సమర్థిస్తున్నట్టుగా కాకుండా ఏక మొత్తంగా టాలీవుడ్ నే టార్గెట్ చేసిన టీవీ చానెళ్ళని కూడా వీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. సిట్ విచారణ అనంతరం బయటికి వస్తున్న పూరీ ఫొటోని పోస్ట్ చేసిన ఒక అభిమాని ఈ పోటో చూడగానే నా రెండు కళ్ళు నీటితో చెమ్మగిల్లాయి..., అంటూ ఇలా స్పందించారు.

సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడతారా?

సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడతారా?

లక్షల కోట్లు ** తిని దేశాన్ని వదిలి వెళ్ళిపోయినోడిని ఏ పీకలేం మనం,ఏవడి పర్సనల్ వాడికి ఉంటాయి..,ఎవడి లైఫ్ వాడిది,ఏం ని ఇంటికి వచ్చి చెప్పాడా డ్రగ్స్ వాడమని? ఎదైనా బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడా? ఏం సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడతారా? రాజకీయ నాయకులు ఏవరు లేరా?పోలిసులు ఏవరు లేరా,రౌడీలు ఏవరు లేరా,బినామిలు ఏవరు లేరా..? ఎందుకు ఉండరూ అందరూ ఉంటారు..కానీ మీకు పబ్లిసిటికి ముందుగా కనిపించేది సినిమా వాళ్ళే......

సినిమా వాళ్ళేనే నిందించకండి

సినిమా వాళ్ళేనే నిందించకండి

వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి,వాళ్ళకి పరువు ప్రతిష్టలు ఉంటాయి. దయచేసి ప్రతి దానికి సినిమా వాళ్ళేనే నిందించకండి..,కానీ ఒకటి మాత్రం నిజం ,సినిమా వాడికి గతి లేక కాదు ,వేరే దానిపై మతిపోక సినిమానే నమ్ముకోని బతుకుతున్నారు...ప్రభుత్వం ఇప్పటికైన అందరి పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నా...

పూరి గారికి వీరాభిమానినే

పూరి గారికి వీరాభిమానినే

ఏది ఏమైనా ప్రాణం ఉన్నంత వరకు పూరి గారికి వీరాభిమానినే....సార్ ఎవడు ప్రతివ్రత కాదు ఇక్కడ,చూసి నేర్చుకోవాల్సిన క్యారక్టర్ ఎవరిది లేదు... అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తం వైరల్ అవుతోంది. సినిమాతో సంబందం ఉన్న ప్రతీ వ్యక్తీ ఈ పోస్ట్ ని వాల్ మీద పోస్ట్ చేస్తున్నాడు.

నిజానిజాలు తేలే వరకూ

నిజానిజాలు తేలే వరకూ

ఇంకా విచారణ కొన సాగుతూనే ఉంది. నిన్న విచారణకు హాజరైన పూరీ డ్రగ్స్ తో తనకేం సంబందం లేదనీ, డ్రగ్ సప్లయర్ కెల్విన్ తో తనకే సబందమూ లేదనీ చెబుతున్నాడు. ఇక నిజానిజాలు తేలే వరకూ పూరీ మీద ఆరోపణలు తగ్గాలనే కోరుకుందాం... అప్పటిదాకా టాలీవుడ్ లో ఈ వాతావరణం ఇలా అనిశ్చితిలోనే ఉంటుందన్నది మాత్రం స్పష్టం...

English summary
A Social meadia post for Puri jagannadh by his one of the fans is Gone Viral
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu