twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వణుకు, ఒత్తిడి ఉంటాయి.. ఆయన వెరీ జీనియస్‌.. ‘తొలిప్రేమ’ కరుణాకరన్

    By Rajababu
    |

    'తొలిప్రేమ', 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌గా తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్న దర్శకుడు ఎ. కరుణాకరన్‌. తాజాగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, స్టన్నింగ్‌ బ్యూటి అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై వల్లభ సమర్పణలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు నిర్మించిన 'తేజ్‌' ఐ లవ్‌ యు చిత్రానికి దర్శకత్వం వహించారు టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కరుణాకరన్‌.

    ఈ చిత్రం జూలై 6న వరల్డ్‌వైడ్‌గా రిలీజై భారీ ఓపెనింగ్స్‌ని సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎ. కరుణాకరన్‌ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో జూలై 7న హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    'తేజ్‌' ఐ లవ్‌ యు సినిమాకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

    'తేజ్‌' ఐ లవ్‌ యు సినిమాకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

    చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రియల్‌ ఇన్సిడెంట్స్‌ సీన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఇంతకు ముందు నేను చేసిన లవ్‌స్టోరీస్‌లో ఇదొక డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే వున్న చిత్రం. ఫ్రెండ్స్‌, బంధువులు ప్రతి ఒక్కరూ ఫోన్‌లు చేస్తూ సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. నిన్ననే సినిమా రిలీజ్‌ అయ్యింది కాబట్టి ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నాం.

    థియేటర్‌లో ఆడియన్స్‌ మధ్య సినిమా చూశారా?
    సిటీలో వున్న అన్నీ థియేటర్స్‌ని విజిట్‌ చేశాను. హెవీ మాస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మెగా ఫ్యాన్స్‌ అంతా సపోర్ట్‌ చేస్తున్నారు. థియేటర్‌లో ప్రతి ఒక్కరూ సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. వారి ఆనందం చూశాక నాకు చాలా హ్యాపీ అన్పించింది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నా కృతజ్ఞతలు.

    నిర్మాత కె.ఎస్‌. రామారావు మేకింగ్‌ ఎలా వుంది?

    నిర్మాత కె.ఎస్‌. రామారావు మేకింగ్‌ ఎలా వుంది?

    క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది నా రెండో చిత్రం. స్టోరి విని బ్యూటిఫుల్‌గా వుంది. ఇది మనం చేద్దాం అని వెంటనే సినిమా స్టార్ట్‌ చేశారు. ఇది ఆయన బేనర్‌లో వచ్చిన 45వ చిత్రం. కథల విషయంలో ఆయనకి పర్‌ఫెక్ట్‌ జడ్జిమెంట్‌ వుంటుంది. వెరీ జీనియస్‌ ప్రొడ్యూసర్‌ రామారావుగారు. ఆయన ఎక్స్‌పీరియన్స్‌ సినిమాకి చాలా హెల్ప్‌ అయ్యింది. అందరం ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని కృషి చేశాం. ఇంత మంచి బ్యూటిఫుల్‌ ఫిల్మ్‌ని నిర్మించిన కె.ఎస్‌. రామారావుగారికి నా కృతజ్ఞతలు. నిర్మాతగా ఆయన చాలా హ్యాపీగా వున్నారు.

    సాయిధరమ్‌ తేజ్‌ క్యారెక్టర్‌కి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది?
    సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్రంలో ఔట్‌ స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. డ్యాన్స్‌లు, ఫైట్స్‌ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. ప్రేక్షకులు సినిమాని నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

    సాయిధరమ్‌ తేజ్‌ లాంటి ఒక మాస్‌ హీరోతో సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేయడం ఎలా అన్పించింది?

    సాయిధరమ్‌ తేజ్‌ లాంటి ఒక మాస్‌ హీరోతో సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేయడం ఎలా అన్పించింది?

    ఫ్యామిలీ లవ్‌స్టోరి చిత్రం ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రెండు యాక్షన్‌ సన్నివేశాలు వున్నాయి. అవి కూడా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. రెండు ఫైట్స్‌ కథలో భాగంగా వస్తాయి. అనవసరంగా ఫైట్స్‌ పెట్టడం నాకు ఇష్టం వుండదు.

    ఇప్పటికీ మిమ్మల్ని 'తొలిప్రేమ' కరుణాకరన్‌ అనే అంటారు కదా.. ఆ రేంజ్‌ హిట్‌ రాలేదు అనే ఫీలింగ్‌ ఏమైనా వుందా?
    - 'తొలిప్రేమ' సినిమా ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఎంజాయ్‌ చేస్తూ చేసిన సినిమా. అది ఒక ట్రెండ్‌ సెట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మళ్లీ అలాంటి చిత్రం చెయ్యడానికే ట్రై చేస్తున్నాను. నా ప్రతి సినిమా చేసేటప్పుడు ఒత్తిడి బాగా ఉంటుంది. వణుకు పుడుతుంది. అన్ని సినిమాలు 'తొలిప్రేమ'లా ఉండవు. దానిని రీచ్‌ అవ్వడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. అందుకు అందరి సపోర్ట్‌ నాకు కావాలి.

    గోపీసుందర్‌ మ్యూజిక్‌ సినిమా హిట్‌కి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?

    గోపీసుందర్‌ మ్యూజిక్‌ సినిమా హిట్‌కి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?

    గోపీసుందర్‌ జీనియస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. 'అడిగా.. అడిగా', 'అందమైన చందమామ' పాటలు బిగ్‌ హిట్‌ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. ఈ సినిమాకి గోపీ సుందర్‌ మ్యూజిక్‌ ఒన్‌ ఆఫ్‌ మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది.

    ఆండ్రూ ఫోటోగ్రఫీ ఎంతవరకు హెల్ప్‌ అయ్యింది?
    - 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో ఆండ్రూ కెమెరామెన్‌గా ఇంట్రడ్యూస్‌ అయ్యాడు. అప్పట్నుంచీ నాతో ట్రావెల్‌ చేస్తున్నాడు. స్టోరీ బోర్డ్‌తో నేను సెట్‌కి వెళ్ళాక నా మైండ్‌లో వున్న విషయాన్ని చెప్పగానే ఇమ్మీడియెట్‌గా తన విజువలైజేషన్స్‌తో దానిని స్క్రీన్‌పైకి తెస్తాడు. సాంగ్స్‌, సీన్స్‌ అద్భుతంగా పిక్చరైజ్‌ చేశాడు. ఆండ్రూ విజువల్స్‌ స్క్రీన్‌పై కన్నుల పండుగగా వుందని అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఆండ్రూ ఫోటోగ్రఫీ సినిమాకి చాలా హెల్ప్‌ అయ్యింది. అలాగే ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేశ్‌ ఫెంటాస్టిక్‌ సెట్స్‌ వేశాడు. అలాగే స్వామి రాసిన డైలాగ్స్‌కి మంచి అప్లాజ్‌ వస్తోంది. నా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అంతా నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. సమిష్టి కృషి వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. నా టీమ్‌ అందరికీ ధన్యవాదాలు.

     హీరోయిన్‌ అనుపమ పెర్‌ఫార్మెన్స్‌ గురించి?

    హీరోయిన్‌ అనుపమ పెర్‌ఫార్మెన్స్‌ గురించి?

    ఫ్రెష్‌గా కొత్త పెయింటింగ్‌ వేసినప్పుడు ఎంత అద్భుతంగా వుంటుందో అనుపమ పరమేశ్వరన్‌ పెర్‌ఫార్మెన్స్‌ అంతే అద్భుతంగా వుంటుంది. బ్యూటిఫుల్‌గా క్యారెక్టర్‌లో జీవించి చేసింది. తన కళ్ళతోనే హావభావాలు పలికించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఆడియన్స్‌ ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు అను క్యారెక్టర్‌ని బాగా లైక్‌ చేస్తున్నారు.

    ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
    చాలామంది నిర్మాతలు, దర్శకులు ఫ్రెండ్స్‌, వెల్‌ విషర్స్‌ అందరూ కాల్స్‌ చేసి మంచి సినిమా చేసావ్‌. సినిమా చాలా బాగుంది అని అప్రిషియేట్‌ చేస్తున్నారు.

     మీ ఫ్యామిలీ మెంబర్స్‌ సినిమా చూసి ఏమన్నారు?

    మీ ఫ్యామిలీ మెంబర్స్‌ సినిమా చూసి ఏమన్నారు?

    నా వైఫ్‌, పిల్లలు అందరికీ సినిమా బాగా నచ్చింది. మాది చాలా పెద్ద కుటుంబం. 35 మంది సభ్యులు వున్నారు. అందరూ సినిమా చూసి ఫోన్లు చేస్తుంటే చాలా హ్యాపీగా వుంది.

    మీకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏది?
    థియేటర్‌లో ప్రేక్షకులు విపరీతంగా నవ్వుతున్నారు. అదే నా బెస్ట్‌ కాంప్లిమెంట్‌. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అందరూ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది అని చెప్తున్నారు.

    మీకు ఎలాంటి సినిమాలు చెయ్యాలని వుంది?

    మీకు ఎలాంటి సినిమాలు చెయ్యాలని వుంది?

    పిల్లలు, పెద్దలు, యూత్‌ అంతా థియేటర్‌కి వచ్చి సినిమాని ఎంజాయ్‌ చేస్తూ వుండాలి. అదే నా కాన్సెప్ట్‌. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు, లవ్‌స్టోరీస్‌ని కొత్తగా ప్రజెంట్‌ చెయ్యాలనేది నా కోరిక. నాకు అలాంటి చిత్రాలు మాత్రమే తీయడం వచ్చు. తీస్తాను.

    నెక్స్‌ట్‌ సినిమా ఏంటి?
    నా దగ్గర చాలా కథలు రెడీగా వున్నాయి. ప్రస్తుతం 'తేజ్‌' ఐ లవ్‌ యు సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాం. తర్వాత నెక్స్‌ట్‌ ఫిల్మ్‌ గురించి ఆలోచిస్తాను.

    English summary
    Supreme Hero Sai Dharam Tej's latest film with Anupama Parameswaran as heroine is 'Tej' with caption 'I Love U'. A.Karunakaran is Directing this film while Creative Producer K.S.Rama Rao, Vallabha are bankrolling this film under Creative Commercials Movie Makers. This film hit the theaters on June 29. 'Tej' is another romantic entertainer from Director A.Karunakaran who earlier delivered Superhit Romantic Movies like 'Tholi Prema', 'Ullasamga Utsahamga', 'Darling', Speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X