»   » ఎంత ముద్దుగా రాసిందో....హీరో నానికి చిన్నారి లేఖ!

ఎంత ముద్దుగా రాసిందో....హీరో నానికి చిన్నారి లేఖ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఓ చిన్నారి తనకు లేఖ రాసిన లేఖను నాని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఓ చిన్న పాప సొంతంగా తయారుచేసిన ఈ లేఖను షూటింగ్‌ స్పాట్‌లో ఇచ్చింది.. నిజంగా ఓ అవార్డుతో సత్కరించిన అనుభూతి ఈ రోజు కలిగింది' అంటూ నాని తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

A little girl letterr to actor Nani

నాని సినిమాల విషయానికొస్తే...వరుస హిట్స్‌తో ముందుకు దూసుకెళ్తున్న హ్యాట్రిక్‌ హీరో నాని 'మజ్ను'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత పి.కిరణ్‌, కేవ మూవీస్‌ అధినేత్రి గీత గొల్ల సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రంలో హను ఇమ్మాన్యుయేల్‌, ప్రియ హీరోయిన్స్‌.

'ఉయ్యాల జంపాల' ఫేం విరించివర్మ దర్శకత్వంలో రూపొందిన 'మజ్ను' చిత్రం సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రిలీజ్‌ అవుతోంది. సినిమా గురించి నాని మాట్లాడుతూ మజ్ను' ఇది నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సినిమా చూసి ఆడియన్స్‌ చాలా ఇంప్రెస్‌ అవుతారు. ఏ లెక్కలు వేసుకోకుండా సింపుల్‌గా తన మనసులో ఉన్న కథని అందంగా చూపించాడు దర్శకుడు అని తెలిపారు.

Nani

సినిమా చేసేటప్పుడు స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఒక స్మైల్‌ ఉంటుంది. తెలియని ఒక హానెస్ట్‌, సింప్లిసిటీ ఉంది. ఈ చిత్రంలో ఫస్టాఫ్‌లో నాలుగు పాటలుంటాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమాలో లేవు. పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి. గోపిసుందర్‌ అవుట్‌ స్టాండింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. లవ్‌స్టోరీ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు ఒక అందమైన కథ చెప్పాలనే ప్రయత్నం చేశాం. నా సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నా సినిమా చూస్తారు. 'మజ్ను'తో అది డబుల్‌ అవుతుందని తెలిపారు.

English summary
"A little girl gives me this personally made card at the shooting spot ..My day is made. RealAward" Nani tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu