»   » ఇదేం డ్రాకులా లవ్వు తల్లీ... ఈ అమ్మాయి హీరోకోసం రక్తం తో

ఇదేం డ్రాకులా లవ్వు తల్లీ... ఈ అమ్మాయి హీరోకోసం రక్తం తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ తారలంటే ఆకర్శణ ఉండటం సహజమే కానీ మరీ వారిని ప్రేమించటం కాస్త శృతిమించటం అనే అనుకూవాలి... ఇక ఏకంగా రక్తం తోనే ప్రేమ లేఖ రాస్తేఅ..!? ఒక ప్పుడు ఈ ఇబ్బంది హీరోయిన్లకి ఉండేది. ప్రేమిస్తున్నాం అంటూ ఫాన్ మయిల్ లో వచ్చే ఉత్తరాల్లో రక్తం తో రాసిన ఉత్తరాలు కనిపించటం. "అయ్యో..! ఇలా చేయవద్దండీ" అంటూ వాళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూల్లో చెప్పటమూ అప్పట్లో మామూలే. అయితే ఇక ఇంటర్నెట్లూ, సోషల్ మీడియా పేజ్ లూ వచ్చాక డైరెక్ట్ గా ఓ కామెంట్ గానో, ఇన్ బాక్స్ లోనో ప్రేమ సందేశాలు పంపుతున్నారు. కానీ ఇప్పుడు అంత బ్రమలు ఎవరికీ లేవు. సినీ హీరోలనో, హీరోయిన్లనో పెళ్ళి చేసుకోవటం సద్ధ్యం కాదు, అంత అవసరం కూడా లేదూ అన్న విసయం చాలా మందికే అర్థమయ్యింది.

A love letter written in blood for Kalidas Jayaram

అయితే ఇంకా అక్కడడక్కడా ఇంకొందరి ఇలాంటి ప్రేమ పిపాసులు ఉన్నట్టే ఉన్నారు. తాజాగా మలయాళి అభిమాని తన అభిమాన హీరోపై ఉన్న ప్రేమను లెటర్ ద్వారా వ్యక్తపరచింది. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి తన బ్లెడ్ తో లెటర్ రాయడం. మాలీవుడ్ హీరో కాళిదాస్ జయరామ్ కి సదరు అభిమాని 'కన్నెట్ట లవ్ యూ' అని బ్లడ్ తో లెటర్ రాసి పంపింది. ఈ లెటర్ చూసిన కాళిదాస్ జయరామ్ ఈ లెటర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కి సందేశాన్ని ఇచ్చాడు. దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయోద్దని, మేము చేసే సినిమాలు ఆదరించి మంచి సక్సెస్ చేస్తే అంతకు మించిన లవ్ మరొకటి ఉండందంటూ ఈ హీరో రిక్వెస్ట్ చేశాడు. కాళిదాస్ జయరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పూమారం చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

English summary
One such disturbing incident has happened recently in Kerala. A girl from the state has written a letter to Kalidas Jayaram with her blood. The letter is now doing the rounds in social media pages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu