»   »  'ప్రజారాజ్యం' టైటిల్ తో సినిమా

'ప్రజారాజ్యం' టైటిల్ తో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ టైటిల్ ని వాడుకుంటూ ఫిల్మ్ జర్నలిస్ట్ ,నిర్మాత అయిన సురేష్ కొండేటి ఓ సినీ నిర్మాణానానికి పూనుకుంటున్నారని సమాచారం. గతంలో ప్రేమిస్తే అనే డబ్బింగ్ సినిమాతో కలెక్షన్స్ కుంభవృష్టి కురిపించుకున్న సురేష్ ఈ సారి ప్రజారాజ్యం తో ఓ పొలిటికల్ చిత్రానికి ప్లాన్ చేస్తారని తెలుస్తోంది.

అయితే సురేష్ కొండేటి చిరంజీవికి వీరాభిమాని కావటంతో ఆ సినిమా చిరంజీవి పార్టీ విధానాలకు అర్ధం పట్టే విధంగా ఉంటుందని కొందరంటున్నారు. ఇక ఇప్పటికే చిరు అభిమానులు మెగా మెయిల్ డాట్ కాం పేరుతో ఓ వెబ్ సైట్ స్ధాపించి పాపులర్ చేసారు. ఇక ఇప్పుడీ టైటిల్ ఏ విధమైన సంచలనం సృష్టించనుందో...లేక క్రేజ్ ని క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X