»   »  మురుగదాస్, దిల్ రాజు కాంబినేషన్ ఖరారు

మురుగదాస్, దిల్ రాజు కాంబినేషన్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వైవిధ్యమైన కథాంశాలతో సున్నితమైన భావోద్వేగాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు.. ఏ. ఆర్. మురుగదాస్. తన కథలతో కేవలం తమిళంలోనే కాక తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా తానేంటో నిరూపించుకున్నారు.తమిళంలో స్టార్ డైరక్టర్ మురుగదాస్...ఆయన మంచి దర్శకుడే కాదు, అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తమిళంలో ఆయన హిట్ చిత్రాల్ని అందించారు. ఇప్పుడాయన దిల్‌ రాజుతో కలసి ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అయితే ఆయన దర్శకుడుగా కాదు... ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తారు. ఆయన మురుగదాస్‌ శిష్యుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి

A.R. Murugadoss to join hands with Dil Raju for a bilingual

రీసెంట్ గా గోపీచంద్ మలినేని పండుగ చేస్కో చిత్రం చేసారు. రామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. గోపిచంద్ మలినేని ఇంతకు ముందు అందించిన బలుపు చిత్రం మంచి హిట్ అయ్యింది. ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు గోపీచంద్ మలినేని బ్రాండ్ గా మారారు. శ్రీనువైట్లను అనుకరించి తీస్తున్నాడనే విమర్శలూ ఆయన పై ఉన్నాయి.

అయితే ఈ చిత్రం కత్తి రీమేక్ మాత్రం కాదని తెలుస్తోంది. కత్తి రీమేక్ కు సంభందించిన టాక్స్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఇక గోపీచంద్ మాత్రం తన తదుపరి ప్రాజెక్టు మాత్రం దిల్ రాజు తో అని ఖరారు చేస్తూ ట్వీట్ సైతం చేసారు.

ప్రస్తుతం మురగదాస్ ప్రాజెక్టు విషయానికి వస్తే...

ఇప్పుడు మురగదాస్ హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె తండ్రి శత్రఘ్ణ సిన్హా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళింది. తమిళంలో కొంత కాలం క్రితం విడుదలై ఘనవిజయం సాధించిన ‘మౌనగురు' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

సమకాలీన అంశాలతో, బలమైన కథాంశంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు ‘అకిరా' అన్న పేరు పెట్టినట్టు తెలుస్తోంది. అకిరా మంచి గుండె నిబ్బరం కలిగి ఉన్న వ్యక్తి అన్న అర్థం వచ్చేలా ఆ పేరును పెట్టారు.

ఏ.ఆర్.మురుగదాస్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైలాగ్స్ అందించారు. ఈ సినిమా నేటి సమాజానికి అద్దం పట్టే సినిమాగా చెప్పబడుతోంది.

English summary
Filmmaker A.R. Murugadoss, who is currently busy wrapping up his Hindi directorial ‘Akira’ with Sonakshi Sinha, will soon join hands with producer Dil Raju to bankroll a bilingual with a leading Telugu film star. This project will be directed by Gopichand Malineni, who is basking in the success of his latest Telugu outing ‘Pandaga Chesko’.
Please Wait while comments are loading...