»   »  తెలుగు చిత్ర నిర్మాతల మండలిలో భారీ స్కామ్

తెలుగు చిత్ర నిర్మాతల మండలిలో భారీ స్కామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నిర్మాతల మండలిలో పెద్ద స్కామ్‌ జరిగిందని వాట్సప్‌ మెసేజ్‌లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా వార్తలు నిన్నటి నుంచి వస్తున్నాయి. దీంతో శనివారం ఉదయం అత్యవసర కార్యవర్గ సమావేశం జరిపి ఈ విషయం గురించి చర్చించినట్లు సమాచారం.

గడిచిన రెండేళ్ళలో రూ.50 లక్షలు మాయమయ్యాయనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.23 లక్షలు, అంతకు మునుపు రూ.27 లక్షలు గోల్‌మాల్‌ అయినట్టు అంచనా. ఆడిటింగ్‌లో కానీ ఈ విషయం బయటపడలేదు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ వద్ద ఉన్న లెక్కలకు, బ్యాంకులో ఉన్న మొత్తానికి పొంతన కుదరకపోవడంతో అద్దూరు రెడ్డి అండ్‌ కంపెనీ ఆడిటింగ్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే ఆడిటర్స్‌ గుర్తించకముందు ఈ అకౌంటు వ్యవహారాలను అటు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌, ఇటు జనరల్‌ బాడీ సభ్యులు ఆమోదించడం గమనార్హం. ఎప్పుడైతే అకౌంట్‌ టాలీ కాలేదని ఆడిటర్స్‌ చెప్పారో... తదుపరి జరగాల్సిన జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించకుండా కార్యవర్గ సభ్యులు రద్దు చేశారు.

A Scam in Tollywood Producers Council

నిర్మాతల మండలి అధ్యక్షుడు శివరామకృష్ణగానీ, సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర్లుగానీ, ట్రెజరర్‌ శేఖర్‌బాబుగానీ ఈ విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకొనిరాకపోవటం గమనార్హం. అలాగే ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సభ్యులకు నిర్మాతల మండలి ఎస్సెమ్మెస్‌లను పంపింది. ప్రస్తుతం చౌదరి అసోసియేట్స్‌ ఆడిటింగ్‌ సంస్థతో సెకండ్‌ ఒపీనియన్ కోసం మరోసారి ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పదవుల్లో ఉన్న కార్యవర్గ సభ్యులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ బై లాకి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఫండ్స్‌ని దుర్వినియోగం చేస్తున్నారని, సర్వసభ్య సమావేశాలను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని కొంతమంది సభ్యులు రెండుసార్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ సొసైటీకి కూడా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అయినా అక్కడి నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో త్వరలో కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలిసింది.

English summary
A scam was found in Tollywood Producers council.
Please Wait while comments are loading...