»   » తెలుగు సినిమాకు 'రాజ'మకుటం

తెలుగు సినిమాకు 'రాజ'మకుటం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  "నిదుర లేచి స్వప్నాలను మలుస్తాను కావ్యంగా ...మనష్యులారా రారండని పిలుస్తాను శ్రావ్యంగా" అన్నాడు మహాకవి శ్రీశ్రీ.


  కలలు కనటానికి డబ్బులు అక్కర్లేదు. కానీ కలలు తెరమీద కనటానికి చాలా డబ్బు కావాలి. కలలను సృష్టించటానికి, మనకు అమ్మటానికి పెట్టుబడి పెట్టేవాడు కావాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఒక కల ఇంద్రధనస్సు అయ్యి...మన కళ్ళ ముందు నర్తిస్తుంది. నవ్విస్తుంది. ఏడ్పిస్తుంది. చికాకు తెప్పిస్తుంది. మంచైనా చెడైనా, ఒక అనుభూతిగా శాశ్వతంగా నిలిచిపోతుంది.

  కొన్ని సార్లు అల అవుతుంది..మరికొన్ని సార్లు కళ అవుతుంది. కొన్ని సార్లు రస హీనమై అంతర్ధానమవుతుంది. ఇలాంటి కలలను కలగా మార్చే శిల్పులు అరుదు. అందులోనూ మొదలుపెట్టిన కళా శిల్పాన్ని అంతే ఏకాగ్రతతో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంతే స్ధిర చిత్తంతో పూర్తి చేయటం అచ్చెరువొందేలా రూపొందించటం...ఇంకా అరుదు. అంతేకాకుండా దర్శించిన ప్రతి ఒక్కరి మీదా ప్రగాఢమైన ముద్ర వేయటం, కళాశిల్పులందరికీ సాధ్యమయ్యే పనికాదు.

  A Writer's tribute to Rajamouli for Padmasri award

  కానీ మనకాలంలో ఒకడున్నాడు. అతడే శ్రీశైల శ్రీ రాజమౌళి. అందరూ జక్కన్న అని పొగిడే కళా శిల్పి. పది రూపాయల పనిని, పది కోట్ల పనిని, వంద కోట్ల పనిని, వందల కోట్ల పనిని ఒకేలా చెయ్యాలనుకోవటం, చెయ్యటానికి ప్రయత్నించటం అందరి వల్లా అయ్యే పనికాదు. కానీ ఈయన వల్ల అవుతుంది.

  అతనికి తెలిసిందల్లా ఇష్టంగా కలకనటం. ధైర్యంగా మొదలెట్టడం.ఇష్టమైన పనిని ఇంకా ఇష్టంగా చేయటం. అనంతంగా అవిశ్రాంతంగా శ్రమించటం. పూర్తైన ఆ శిల్పాన్ని ప్రదర్శించటం. మళ్లీ మరొకటి మొదలెట్టడం.

  మనసా,వాచా కర్మణా అనే మాటలకు నిలవెత్తు నిదర్శనం ఎస్.ఎస్ రాజమౌళి. ఈ నిరంతర ప్రయాణంలో విజయం..విజయం ...దిగ్విజయం...తల నెరిసింది. కళ పదునెక్కింది. పూల దారి పెరిగింది. బాట అయ్యింది. రహదారి అయ్యింది. కళ సాగుతోంది. ఎల్లలు దాటింది. జాతీయం అయ్యింది. అంతర్జాతీయమవుతోంది.

  ఎప్పుడూ చూడని కోటాను కోట్ల కళ్ళు ఆయన కళను చూస్తున్నాయి. అయినా అదే శ్రమ అదే చిత్తం. అదే వినమ్రం. సిరులు..పద్మశ్రీలు...ఊరేగింపుగా ఆయన వైపే వస్తున్నాయి. సమూహాలు గళాలు ఎత్తి, సందడి చేస్తున్నాయి.

  అయినా అదే మందహాసం. తన దుర్గంలో తన బృందంతో మరో బృందావన నిర్మాణానికి నిరంతర మహా యజ్ఞంలో నిమగ్నమైన ఎస్ ఎస్ రాజమౌళి గారికి భారతీయ సినిమాకు రాజమకుటాన్ని అందించినందుకు పురస్కారంగా పద్మశ్రీని అందిస్తోంది మన ప్రభుత్వం. ఈ సందర్బంగా ఆయన ఊహలు మరింత గొప్పగా ఊరేగాలని, ఆ ఊరేగింపు ప్రపంచ వ్యాప్తంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... అభినందలతో ఆయన్ని శతమానం భవతి అని ఆశ్వీరదిస్తూ...


  చైతన్య పిన్నమరాజు
  సినీ రచయిత

  (రాజమౌళి..శాంతినివాసం నుంచి మర్యాద రామన్న వరకూ రైటింగ్ డిపార్టమెంట్ లో కొనసాగారు)

  English summary
  Rajamouli will be honoured with Padma Shri award for his contribution to Indian cinema. This is Writer Chitanya Pinnamaraju tribute to Rajamouli.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more