For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘ఎ యష్ చోప్రా రొమాన్స్!’ ఫోటో ఫీచర్

  By Srikanya
  |

  ముంబై: యష్ చోప్రా... ఆయన సినిమాల్లోనే కాదు.. ఆయన మనసులోనూ ఎంతో ప్రేమ నిండి ఉంటుంది. అందుకే ఆయనను 'కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌' అని బాలీవుడ్‌ ముద్దుగా పిలుచుకుంటుంది. చిత్రం చూస్తున్నంతసేపు నటీనటుల పాత్రల్లో ఏమాత్రం హద్దులు దాటని ప్రేమను గమనిస్తే మనమూ అందులో లీనమైపోతాం. అసలు ప్రేమలో పడనివారు స్వచ్ఛమైన ఇలా ఉండాలి కాబోలు అనుకుంటారు. ప్రేమలో ఉన్నవారు ఇలా ప్రేమించుకోవడం నేర్చుకుంటారు. ప్రేమ విఫలమైనవారు మళ్లీ పాత ప్రేమికుల కోసం వెతుక్కుంటారు. ఆయన సినిమాల్లో ప్రేమ, త్యాగం, నమ్మకం, పెద్దరికం, శృంగారం, కామెడీ, ఫైట్లు ఇలా నవరసాల పాత్రలూ మనకు కనిపిస్తాయి.

  యశ్‌చోప్రా పూర్తిపేరు యశ్‌ రాజ్ చోప్రా. 1932 సెప్టెంబర్ 27న నాటి అవిభక్త భారతదేశంలోని లాహోర్‌లో జన్మించాడు. స్వాతంత్రయ వూర్వానంతరం కుటుంబం అంతా పంజాబ్‌లోని లూథియానాకు తరలి వచ్చింది. దేశ విభజన, హిందూ,ముస్లిం భావనలు ఎంతో మందిని ప్రభావితం చేసినట్లే యంగ్ యశ్‌చోప్రాను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆయన బాల్యం అంతా లాహోర్ వీథుల్లోనే గడిచింది. టీనేజ్ అంతా పంజాబీ అనుబంధాలు, పచ్చని పొలాలతో అల్లుకుపోయింది. ఈ బాల్య జ్ఞాపకాలు, టీనేజ్ అనుభవాలు అన్నీ ఆయన ఫిల్మ్‌మేకర్‌గా మారిన తర్వాత తన కథనాలకు ప్రధాన భూమికలయ్యాయి. అచేతనంగానే ఆయన ప్రతీ కథలో ఈ జ్ఞాపకాలన్నీ ఏదో ఒక రూపంలో తెర మీద పాత్రలుగా, సన్నివేశాలుగా తొంగిచూశాయి.

  బి. ఆర్. చోప్రా ముంబైలో ఫిల్మ్‌మేకర్‌గా ఎంతో పేరు సంపాదించాడు. ఆయన సోదరుడిగా యశ్‌చోవూపాకు బాలీవుడ్ ఎంట్రీ కొంత వరకు ఈజీ అయింది. అయినా సినిమా మేకింగ్‌పై అవగాహన పెంచుకోవడానికి యశ్ మొదట ప్రఖ్యాత దర్శకనిర్మాత ఇంద్రజిత్ సింగ్ జోహార్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తన దగ్గరైతే పనిపట్ల అంత సీరియస్‌నెస్ ఉండదేమో అనే ఆలోచనతో బి.ఆర్. చోప్రానే యశ్‌ను జోహార్‌కి అసిస్టెంట్‌గా పంపించాడు. అక్కడే యశ్‌చోప్రా సినిమా మేకింగ్‌లోని అన్ని విభాగాలపై పట్టు సాధించాడు. అదే సమయంలో కథలు రాసుకోవడం కూడా ప్రారంభించాడు. కొంతకాలం బి.ఆర్. చోప్రా దగ్గర కూడా అసిస్టెంట్‌గా చేశాడు. సంచలనం సృష్టించిన ‘నయాదౌర్' సినిమాకి యశ్‌చోప్రా సహాయ దర్శకుడు.

  సినిమా కళలో యశ్‌చోప్రా నైపుణ్యాన్ని గమనించిన బి.ఆర్.చోప్రా తన బ్యానర్‌మీద దర్శకత్వం ఛాన్స్ ఇచ్చాడు. అలా 1959లో తొలిసారిగా యశ్ దర్శకత్వంలో ‘ధూల్ కా ఫూల్' సినిమా విడుదలైంది. అప్పటికి ఆయన వయసు 27 ఏళ్లు. ఈ సినిమా యశ్‌కు ఫిల్మ్‌మేకర్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది. హిందూ - ముస్లిం మతసామరస్య భావనతో సందేశాత్మక చిత్రంగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇదే ఇతివృత్తంతో 1961లో వచ్చిన ‘ధరమ్‌ పుత్ర'ని మాత్రం తిరస్కరించారు. దాంతో దర్శకుడిగా యశ్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.

  అయినా వెనక్కి తగ్గకుండా 1965లో ‘వక్త్' తీసి సక్సెస్ సాధించాడు. 1969లో ‘ఆద్మీ ఔర్ ఇన్‌సాన్'ని, ‘ఇత్తెఫాక్' సినిమాని తీసి భిన్న కథాంశాలను కూడా చక్కగా తీయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే 1975 వరకు యశ్‌చోప్రా కెరీర్ ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లే నడిచింది. కానీ ‘దీవార్' సినిమా తర్వాత యశ్‌చోప్రా పేరు ఒక్కసారిగా బాలీవుడ్ దునియాలో ఆకాశాన్నంటింది. ఆ తర్వాత వరుస హిట్లతో యశ్‌చోప్రా యశస్సు యావత్ భారత సినీ ప్రపంచమంతటా వ్యాపించింది.


  దర్శకుడికి, హీరోకి మధ్య సంపూర్ణ అవగాహన ఉంటేనే సినిమా అద్భుతంగా వస్తుంది. అలాంటి అనుబంధమే మొదట్లో యశ్‌చోప్రా, అమితాబ్ బచ్చన్‌ల మధ్య ఏర్పడింది. దాంతో యశ్ అమితాబ్‌తో ఏకంగా ఐదు సినిమాలు దీవార్ (1975), కభీ కభీ (1976), త్రిశూల్ (1978), కాలా పత్థర్ (1979), సిల్‌సిలా (1981)లను తీశాడు. వీటితో అమితాబ్‌కు స్పెషల్ ఇమేజ్‌ను ఇచ్చాడు. తను అరుదైన విజయాలను సాధించాడు.

  అమితాబ్...మళ్లీ అలాంటి అనుబంధమే యశ్‌కు షారూఖ్‌తో ఏర్పడింది. డర్ (1993)తో మొదలైన వీరి సమన్వయం దిల్‌తో పాగల్ హై (1997), వీర్ జరా (2004)లతో సూపర్ సక్సెస్‌గా మారి ప్రస్తుతం ‘జబ్ తక్ హై జాన్' దాకా వచ్చింది.

  ట్రయాంగిల్ లవ్ స్టోరీల ఫార్ములాకి సినీగౌరవాన్ని తెచ్చిన దర్శకుడు యష్ చోప్రానే. అయితే ప్రేమకథలన్నిటిలో ఆయన స్త్రీ పాత్రల పక్షపాతిగానే వ్యవహరించడం విశేషం. కభీ కభీ, చాందినీ, లమ్‌హే సినిమాలు దీనికి ఉదాహరణలు. అలాగే మ్యూజిక్‌ని, అందమైన లొకేషన్స్‌ని కూడాసినిమా కథలో ఓ క్యారెక్టర్‌గా వాడుకోవడం యశ్ స్టైల్ అయింది. తర్వాత అది ఎంతోమందికి దర్శకులకు ఓ గైడ్‌లా మారింది.


  1973లో ‘దాగ్' సినిమాతో సొంత బ్యానర్ ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్'ను స్థాపించి నిర్మాతగా కూడా తనదైన శైలితో దూసుకుపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నిటినీ ఆయన నిర్మించడమే కాక, ఎంతో మంది ఔత్సాహిక దర్శకులకు యశ్‌రాజ్ బ్యానర్‌లో అవకాశమిచ్చాడు. బాలీవుడ్ అభివృద్ధికి ఓ సపోర్ట్ సిస్టంలా, యంగ్ టాలెంట్‌కి లాంఛింగ్ ప్యాడ్‌లా తన బ్యానర్‌ని నిలిపాడు. కునాల్ కొహ్లీ (హమ్‌తుమ్ - 2004), సంజయ్ గధ్వీ, కబీర్‌ఖాన్, షిమత్ అమీన్, జుగల్ హంస్‌రాజ్‌లాంటి వారికి పెద్దదిక్కుగా నిలిచాడు.

  తన కొడుకు ఆదిత్య చోప్రాను దర్శకుడిగా పరిచయం చేస్తూ 1995లో ఆయన తీసిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' మూవీ మొత్తం ఇండియన్ సినిమా గమనాన్నే మార్చేసింది. ‘ధూమ్' సిరీస్ సినిమాలు సరికొత్త యాక్షన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ‘మొహబ్బతే', ‘చక్ దె ఇండియా', ‘హమ్‌తుమ్', ‘ఫనా', ‘రబ్ నె బనాది జోడీ', ‘న్యూయార్క్', ‘సలామ్ నమస్తే', ‘బ్యాండ్ బాజా బారాత్', ‘ఇష్క్ జాదె' లాంటి సినిమాలు యశ్ ప్రత్యేకతను చాటాయి. ఇక సల్మాన్ హీరోగా వచ్చిన ‘ఏక్ థా టైగర్' క్రాస్ కల్చరల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రికార్డ్ సృష్టించింది.

  యశ్‌చోప్రాను ఎన్నెన్నో అవార్డులు వరించాయి. 2001లో ప్రతిష్టాత్మాక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును. 2005లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ అవార్డును నాలుగు సార్లు అందుకున్నాడు. ఆయన సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రాలుగా జాతీయ స్థాయిలో ఐదు సార్లు అవార్డులను గెలుచుకున్నాయి. ఇది ఓ అరుదైన రికార్డ్.

  వెండితెరపై, బాలీవుడ్ షో వరల్డ్‌పై ఆయన సంతకాన్ని ఆవిష్కరించే ఆఖరి ప్రయత్నం ‘జబ్ తక్ హై జాన్'. ఈ మధ్యేనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో రూపొందించిన ప్రోమో చివర ఓ టైటిల్ పడింది. ప్రోమోలోని విజువల్స్ అన్నీ ప్రేక్షకుల కళ్లని మెస్మరైజ్ చేశాయి కానీ...ఆ చివరి టైటిల్‌లోని అక్షరాలు మాత్రం సూటిగావెళ్లి గుండెని తాకాయి. ఆ అక్షరాలన్నీ కలిపితే...‘ఎ యశ్ చోప్రా రొమాన్స్!

  యశ్‌.. తన ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో విభిన్న తరహా చిత్రశిల్పాలను తీర్చిదిద్దారు. సిల్‌సిలా, త్రిశూల్‌, చాందిని, దిల్‌తో పాగల్‌హై, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (నిర్మాతగా), మొహబ్బతే, వీర్‌జారా వంటి చిత్రాలతో రొమాన్స్‌ రారాజుగా పేరొందారు. బాలీవుడ్‌లో 'యశ్‌చొప్రా రొమాన్స్‌' అనే పదబంధం ఆయన పేరిట విస్తృతంగా వాడుకలోకి రావడం ఆయన కీర్తికిరీటంలోని మేలురాయి. యశ్‌చోప్రా సినీ ప్రయాణాన్ని ఆలస్యంగానే మొదలుపెట్టినా.. ప్రేక్షకుల నాడిని పట్టి, ప్రతి దశాబ్దంలోనూ వరసగా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ఇవ్వడం ఆయనకే చెల్లింది. ధూమ్‌ సిరీస్‌ సినిమాలతో ఆధునిక తరం చిత్రాల నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు.

  English summary
  
 Yash Chopra, who celebrated his 80th birthday on September 27, changed the face of romance in Hindi cinema to become a brand in Bollywood, with hits such as Kabhie Kabhie, Silsila, Chandni and Dil to Pagal Hai in his five-decade long illustrious career. Born on September 27, 1932 in Lahore, Chopra also thrilled fans with action dramas such a Trishul and Deewar, which established Amitabh Bachchan as the “angry young man”.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more