»   » హీరో ఆది....తొలి డబ్‌స్మాష్ వీడియో ఇదే!

హీరో ఆది....తొలి డబ్‌స్మాష్ వీడియో ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మద్య డబ్ స్మాష్ వీడియోల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా హీరో ఆది కూడా తన తొలి డబ్ స్మాష్ వీడియో రిలీజ్ చేసారు. అది కూడా తన తండ్రి నటించిన ‘పోలీస్ స్టోరీ' సినిమాలోని పాపులర్ డైలాగ్ ...కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అంటూ అదరగొట్టాడు. ఆయన డైలాగ్ చెప్పిన లెవల్స్‌కి నేను సరిపోనని తెలుసు...కానీ వల్ల అయినట్లుగా ట్రై చేసాను అంటూ ఆది పేర్కొన్నాడు. ఆ సినిమా విడుదలై 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మై ట్రైబ్యూట్ అంటూ ఆది చెప్పుకొచ్చారు.

My first ever #dubsmash, from Dad's movie #PoliceStory.. I know I can't match his levels but tried my best :)Its been...

Posted by Aadi onFriday, January 8, 2016

గరం...
త్వరలో ఆది ‘గరం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయికుమార్‌ తనయుడు ఆది, అదాశర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం గరం. ఈ చిత్రానికి మదన్‌ దర్శకత్వం వహిస్తుండగా, అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఆర్కే సినిమాస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘మొదటిసారి నా కెరీర్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఈ సినిమాలో మేము చూపించే పాయింట్ ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతుంది, అందుకే ఈ మూవీ పక్కాగా అందరికీ నచ్చుతున్న కాన్ఫిడెంట్ తో ఉన్నానని' ఆది అన్నాడు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి, కెమెరా: సురేందర్‌రెడ్డిటి. సంగీతం:ఆగస్త్య, కళ: నాగేంద్ర, ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత:బాబ్జీ, కో-డైరెక్టర్‌: అనిల్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్‌.

Aadi Police Story dubsmash

చుట్టాలబ్బాయ్....
యువ నటుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘చుట్టాలబ్బాయ్'. ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలోలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్నారు. ప్రేమకావాలి, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, అహనా పెళ్లంట, పూలరంగడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.

English summary
"My first ever ‪‎dubsmash‬, from Dad's movie ‪‎Police Story‬.. I know I can't match his levels but tried my best smile emoticon. Its been 20 years since the movie released.. So this one is my tribute to my ‪Hero Dad‬ and the movie Police Story." Aadi said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu