»   » సుధీర్ బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జి’ (ఫోటోలు)

సుధీర్ బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జి’ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరోల సినిమాలోని డైలాగులు, పాటలనే....టైటిల్స్‌గా ఎంచుకోవడం ఈ మధ్య ట్రెండుగా మారింది. అతడు సినిమాలో ఆడు మగాడ్రా బుజ్జి అంటూ మహేష్ బాబును ఉద్దేశించి తనికెళ్లభరణి చెప్పిన డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది. దీంతో 'ఆడు మగాడ్రా బుజ్జి' పేరుతో సినిమాకు ప్లాన్ చేసారు.

మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న 'ఆడు మగాడ్రా బుజ్జి' చిత్రాన్ని కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై సుబ్బారెడ్డి, ఎస్.ఎస్.రెడ్డిలు నిర్మిస్తున్నారు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. సుధీర్ బాబు సరసన పూనమ్ కౌర్, అస్మితా సూద్ హీరోయిన్లు.

తాజాగా శుక్రవారం ఈచిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

అతడు సినిమా ఇన్‌స్పిరేషన్

అతడు సినిమా ఇన్‌స్పిరేషన్

ఈ చిత్ర హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ మహేష్ బాబు నటించిన ‘అతడు' సినిమా ఇన్‌స్పిరేషన్ గా చిత్రం టైటిల్ పెట్టినట్లు తెలిపారు. మహేష్ బాబు పుట్టినరోజునాడే ఈ చిత్రం లోగో ఆవిష్కరణ జరుగడం ఆనందంగా ఉందని తెలిపారు.

సుధీర్ బాబు సత్తా చాటేసినిమా

సుధీర్ బాబు సత్తా చాటేసినిమా

ఈ సినిమాలో తనలోని అన్ని క్వాలిటీస్‌ను నిరూపించుకునే విధంగా ఉంటుందని, దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉందని, నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సుధీర్ బాబు తెలిపారు.

హీరోయిన్లు

హీరోయిన్లు

ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన అస్మితా సూద్, పూనమ్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు సుధీర్ బాబకు తగిన జోడీగా ఉన్నారని, వారి పాత్రలకు తగిన హీరోయిన్ల యూనిట్ సభ్యులు అంటున్నారు.

అక్టోబర్లో సినిమా

అక్టోబర్లో సినిమా

సినిమాను అక్టబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ ఈ నెలలో టాకీ పూర్తి చేసి, వచ్చే నెలలో ఆడియో విడుదల చేసామని, అక్టోబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు.

తారాగణం, సాంకేతిక నిపుణులు

తారాగణం, సాంకేతిక నిపుణులు

ఈ సినిమాలో ఇంకా సుమన్, నరేష్, అజయ్, రణధీర్, కృష్ణ భగవాన్, పృథ్వీరాజ్, చంటి, బస్ స్టాప్ సాయి, సుమన్ శెట్టి, గుండు హనుమంతరావు, కరాటే కల్యాణి, అనంత్, సంధ్యా ఝనక్, లక్ష్మీ, జెమిని సురేష్ తదితరులు నటించారు. సంగీతం : శ్రీ, కెమెరా : శాంటోనియో ట్రెజియో, కథ : కృష్ణారెడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, మాటలు : పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు : అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, చిర్రావూరి విజయ్ కుమార్, ఆర్ట్ : నారాయణరెడ్డి, స్టంట్ : సాల్మన్ రాజ్, నిర్మాతలు: సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కృష్ణారెడ్డి గంగదాసు.

English summary
Sudheer Babu, Ponam kour, Asmitha sood starrer Aadu Magadra Bujji First Look released. The Movie directed by Krishna Reddy Ganga dasu and Music composed by Sri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu