»   »  ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఆడియోలో మహేష్‌ (ఫోటోలతో)

‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఆడియోలో మహేష్‌ (ఫోటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా 'ప్రేమ కథా చిత్రమ్' తో విజయాన్ని అందుకున్న సుధీర్ బాబు త్వరలోనే 'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ, విజయ నిర్మల ముఖ్య అతిధులుగా విచ్చేసి తమ శుభాశ్సీసులు అందచేసారు.

మహేష్ ఈ ఆడియో పంక్షన్ కి రావటంతో చాలా క్రేజ్ క్రియేట్ అయ్యి...చాలా ఉత్సాహంగా ఈ పంక్షన్ జరిగింది. ఝాన్సి యాంకరింగ్ తో అతిధులను స్టేజీపై ఆహ్వానిస్తూ ఆద్యంతం ఎంటర్ట్రైన్మెంట్ మిక్స్ చేసి ఈ ఆడియో ఫంక్షన్ ని నడిపించారు.

తన బావ మహేష్ ఈ పంక్షన్ కి రావటంతో సుధీర్ సైతం చాలా ఎక్సైంటింగ్ ఫీలయ్యారు. ముఖ్యంగా మహేష్ అభిమానుల హర్షద్వానాలతో ఈ పంక్షన్ ఆధ్యంతం మారు మ్రోగుతూనే ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని అంతా కోరుకున్నారు. ఈ పంక్షన్ లో విడుదల చేసిన ట్రైలర్ సైతం చాలా ప్రామిసింగ్ గా ఉండి సినిమాపై నమ్మకాన్ని పెంచింది.

ఆడియో విశేషాలు...స్లైడ్ షోలో...

తొలి సీడిని...

తొలి సీడిని...


సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రమిది. అస్మితాసూద్‌, పూనమ్‌కౌర్‌ నాయికలు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. ఎం.సుబ్బారెడ్డి, ఎస్‌.ఎన్‌.రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ స్వరాలు సమకూర్చారు. తొలి సీడీని మహేష్‌బాబు ఆవిష్కరించారు. కృష్ణ ప్రచార చిత్రాలను విడుదల చేశారు.

మహేష్ బాబు మాట్లాడుతూ....

మహేష్ బాబు మాట్లాడుతూ....


''నేను ప్రోత్సహించానని చెబుతుంటాడు సుధీర్‌. ఇలా పాటల వేడుకలకి రావడం తప్ప నేనేమీ చేయలేదు. తను ఎవరి సహాయం లేకుండా నిలదొక్కుకున్నందుకు గర్వంగా ఉంది'' అన్నారు.

మహేష్‌బాబు కంటిన్యూ చేస్తూ

మహేష్‌బాబు కంటిన్యూ చేస్తూ

మహేష్‌బాబు కంటిన్యూ చేస్తూ... ''ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి. 'ప్రేమకథా చిత్రమ్‌'లాగే ఇది కూడా బాగా ఆడాలి. ఈ సినిమాకోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు నా శుభాకాంక్షలు. '1' చిత్రం జనవరి 10న విడుదల కాబోతోంది. చూసి ఆనందించండి'' అన్నారు.

కృష్ణ మాట్లాడుతూ...

కృష్ణ మాట్లాడుతూ...


''ఈ సినిమా పేరు చాలా బాగుంది. ప్రచార చిత్రంలో వినోదం, యాక్షన్‌ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి మాస్‌ చిత్రం అవుతుందనే నమ్మకముంది''అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ....

సుధీర్‌బాబు మాట్లాడుతూ....

''మావయ్య కృష్ణగారి దగ్గరికి వెళ్లి ఏమడిగినా సరే అంటారు. మహేష్‌ మాత్రం ఏదైనా ఆలోచించి చెబుతాడు. ప్రతీ విషయంలో చాలా స్పష్టతతో ఉంటాడు. కుటుంబ అనుబంధాల కోసం ఏమైనా చేస్తాడు. కోటి రూపాయలైనా ఇస్తాడుగానీ సిఫారసు మాత్రం చేయడు. '' అన్నారు.

సుధీర్ బాబు కంటిన్యూ చేస్తూ...

సుధీర్ బాబు కంటిన్యూ చేస్తూ...

అర్హతలేని వ్యక్తులకు అతన్నుంచి ఎలాంటి సహకారం అందదు. తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మంచి ఉత్పత్తులనే ఎంచుకొంటాడు. అన్ని విషయాల్లోనూ మహేష్‌ నాకు స్ఫూర్తి. నా వేడుకలకు రమ్మని పిలవడానికి వెళ్లినప్పుడు కూడా ఆ అర్హత ఉందా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకొంటాను అన్నారు.

వెనక మహేష్ ఉన్నాడు..

వెనక మహేష్ ఉన్నాడు..

నా వెనకాల మహేష్‌ ఉన్నాడు. నా ముందు అభిమానులున్నారు. నా జీవితకాలం ఇలా కష్టపడుతూనే ఉంటా. మహేష్‌ అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిది అంటూ తన చిత్రం తప్పకుండా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేసారు సుధీర్.

పూనమ్‌కౌర్‌ మాట్లాడుతూ...

పూనమ్‌కౌర్‌ మాట్లాడుతూ...


''ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. మహేష్‌కి సుధీర్‌ బంధువు అని తెలిసి వెంటనే ఒప్పుకొన్నాను''న్నారు.

దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ...

దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ...

''ఈ చిత్ర దర్శకుడు, నేను మంచి స్నేహితులం. కలిసి ఐదు సినిమాలకి పనిచేశాం. తనలో కసి కనబడుతోంది. తప్పకుండా మంచి సినిమా తీసుంటాడు'' అన్నారు.

అస్మితాసూద్‌ మాట్లాడుతూ...

అస్మితాసూద్‌ మాట్లాడుతూ...

''ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది.. చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది..మహేష్ ఈ పంక్షన్ కి రావటం చాలా ఆనందంగా ఉంది''అని చెప్పింది.

నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..


సినిమాని దర్శకుడు తమకు చెప్పినట్లే తీసాడని, ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మహేష్ ఫ్యాన్స్ అందరికీ ధాంక్స్ అని, ఆడియో పంక్షన్ లాగానే సినిమాని కూడా విజయవంతం చేయాలని కోరారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


తమ హీరో సుధీర్ బాబు కి, మహేష్ కు ధాంక్స్ చెప్పారు. తమకు అన్ని విధాల సహకరించి సినిమా అవుట్ పుట్ బాగా రావటానికి నిర్మాతలకు ఈ సక్సెస్ అయ్యి ఫలితం అందుతుందని మాట్లాడారు.

ఎవరెవరు..

ఎవరెవరు..

ఈ కార్యక్రమంలో విజయనిర్మల, నరేష్‌, బెల్లంకొండ సురేష్‌, అజయ్‌, రణధీర్‌, భీమనేని శ్రీనివాసరావు, రాహుల్‌, వీరు పోట్ల, సుభాష్‌ చంద్ర, భవ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Mahesh Babu’s Brother-in-law Sudheer Babu who made his Tollywood debut with SMS but the movie did not make him to stand on the success track. After that he has team up with Marutrhi’s “Prema Katha Chitram” ,with this movie he has tasted his first success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu