»   » ట్వీట్: మహేష్ బాబూ....నువ్వు ఎప్పుడూ ఇంతేనటయ్యా!

ట్వీట్: మహేష్ బాబూ....నువ్వు ఎప్పుడూ ఇంతేనటయ్యా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న హీరో మహేష్ బాబు. సినిమాలు, ఎండార్స్ మెంట్లు......తప్ప బయటి ప్రపంచానికి వీలైనంత దూరంగా ఉండే వ్యక్తి. ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్ సైట్లలో ఆయనకు ఖాతా ఉన్నప్పటీ ఇతర స్టార్ల మాదిరిగా అభిమానులతో టచ్‌లో ఉండటం, తన పర్సనల్ విషయాలు పంచుకోవడం తక్కువే.

తాను నటించిన సినిమానో, ఆ సినిమా సంబంధించిన ట్రైలర్ విడుదలైనప్పుడు మంచి స్పందన వస్తే డైరెక్టర్లకు, అభిమానులకు థాంక్స్ చెప్పడానికి తప్ప....ఆయన దాన్ని అసలు ఉపయోగించిన సందర్భాలు చాలా తక్కువ. ఇటీవల తన బావ గల్లా జైదేవ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సయమంలో మాత్రం ఆయనకు మద్దతుగా ట్వీట్ చేసారు.

Aagadu : Mahesh Babu thanks his fans

తాజాగా 'ఆగడు' సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో.......ఎప్పటిలాగే ట్వీట్ చేసారు మహేష్ బాబు. 'ఆగడు' ట్రైలర్‌‌కు మంచి స్పందన వస్తోంది. ఎంటైర్ 14 రీల్స్ టీం, డైరెక్టర్ శ్రీను వైట్లకు థాంక్స్. నా అభిమానులకు ఇంకా పెద్ద థాంక్స్' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

ఆగడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాసరానాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
“Aagadu’s trailor gets a phenomenal response.thanks to the entire team of 14 reels and my dear director sreenu vaitla..a big thankyou to all of my fans ..love you guys as always:)”, said Mahesh on twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu