twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్...ముందే వస్తున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రెండు పెద్ద చిత్రాలు ఒకే సారి విడుదల అయితే అభిమానుల్లో ఆనందం ఉంటుంది కానీ డిస్ట్రిబ్యూటర్స్ లో టెన్షన్ ప్రారంభమవుతుంది. ఓ చిత్రానికి కొద్దిగా తేడా టాక్ వచ్చినా అది రెండో దానికి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా థియోటర్స్ సమస్య వస్తూంటుంది. ఇప్పుడు గోవిందుడు అందరి వాడేలే, ఆగడు రెండూ దాదాపు ఒకే సమయంలో భాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఆగడు ని సెప్టెంబర్ 26న విడుదల చేయాలని ఖరారు చేసినట్లు సమచారం. గోవిందుడు అందరి వాడేలా అక్టోబర్ 1 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దసరా ..అక్టోబర్ 3 శుక్రవారం వచ్చింది. దాంతో పండుగ రోజుల్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెండు చిత్రాలు ముందుకు వస్తున్నాయి. ఇంతకు ముందు సంక్రాంతికి ఇద్దరూ పోటీ పడ్డారు. ఇప్పుడు మళ్లీ దసరాకు వస్తున్నారు. అయితే ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే బాగుంటుందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

    ఆగడు విషయానికి వస్తే... తమన్నా హీరోయిన్ . 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

    'Aagadu' to Release on Sep 26th

    చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్,బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

    'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Mahesh's Aagadu is set to release on Sep 26th for Dussera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X