twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆగడు' ఎక్కడదాకా వచ్చింది?

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'సార్‌ వాచీ తీశారంటే మ్యాచ్‌ మొదలైనట్టే' అన్నాడు ట్రైలర్‌లో వెన్నెల కిషోర్‌. అతడన్నట్లే మహేష్‌బాబు మ్యాచ్‌ మొదలెట్టేశాడు. అదేనండి రౌడీలను చావకొట్టడం. విజయ్‌ మాస్టర్‌ దీనికి నేతృత్వం వహించారు. సోమవారంతో క్త్లెమాక్స్‌ షూటింగ్ ముగించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హిల్‌ ఏరియాలో దీన్ని చిత్రించారు. బుధవారం నుంచి విదేశాల్లో పాటల చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. మహేష్‌బాబు, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీనువైట్ల దర్శకుడు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు.

    ఈ చిత్రం రెండు పాటలు కోసం యూరప్ వెళ్ళారు. 21 వ తేదిన ఇండియాకు వస్తారు. ఇంకా ఏడు రోజుల టాకీ, ఆరు రోజుల ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ మొదటివారానికి గుమ్మిడికాయ కొట్టేయనున్నారు. అప్పటితో ఈ మ్యాచ్‌ పూర్తవునుంది.కృష్ణ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్‌ తరహాలోనే ఈ రెండో టీజర్‌లో హైవోల్టేజి యాక్షన్‌ సీన్లు, పంచ్‌ డైలాగులు ఉన్నాయి.

    Aagadu Shoot Completion in Sep 1st week

    మహేశ్‌ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టిందంట', 'అయినా నువ్వు డైలాగ్‌ వేస్తే కౌంటర్‌ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్‌ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త టీజర్‌తో 'ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఒక 'ఫీలర్‌' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా మహేశ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్‌ అందించిన మాస్‌ మసాలా గీతమిది. ఇందులో మహేష్‌, శ్రుతిహాసన్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Aagadu has moved to Europe now for the remaining 2 songs shoot!. The Unit will be back in India by 21st or so to finish the final schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X