»   » మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ ఏంటో తెలుసా?

మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆగస్టు 9వ తేదీన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మరి మహేష్ బాబు లాంటి స్టార్ పుట్టినరోజంటే అభిమానులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా. ఎప్పటిలానే ఈ సారికూడా అభిమానుల కోసం ఓ బహుమతి సిద్దమవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'ఆగడు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 31న ఆడియో విడుదల చేసి...సెప్టెంబర్ 19 లేదా సెప్టెంబర్ 26వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Aagadu Trailer on Mahesh Babu's birthday

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచింది. ఇక ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్.

దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల, నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, నెపోలియన్‌, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
The shooting of Mahesh Babu’s Aagadu is going on at brisk pace. The makers are planning to release the trailer of the film on August 9th on the occasion of Mahesh Babu’s Birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu