»   » గర్వంగా ఉందన్న అమీర్ ఖాన్, ముంబైలో ఉండొద్దని భార్యకు...

గర్వంగా ఉందన్న అమీర్ ఖాన్, ముంబైలో ఉండొద్దని భార్యకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ ‘దేశంలో అసహనం పెరుగుతోందని, నా భార్య భారత్ వదిలి వెళ్లి పోదామని అడుగుతోంది' అనే విషయాన్ని బయట పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

అన్ని వర్గాల నుండి నుండి అమీర్ ఖాన్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ కు భద్రత పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైలో ఉండటం మంచిది కాదు, కొంత కాలం పాటు వేరే ప్రాంతానికి వెళ్లి పోవాలని, పరిస్థితి చల్లబడ్డ తర్వాత తిరిగి రావాలని ఆయన తన భార్య కిరణ్ రావుకు సూచించారు

వివరణ ఇచ్చిన అమీర్..
మత అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నేను, నా భార్య ఈ దేశం విడిచి వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇక్కడే ఉంటాను, భారత గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రజల మధ్య సోదరభావం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు.

 Aamir Khan asks wife Kiran to leave Mumbai after protests

రెహమాన్ మద్దతు..
అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఇతర నటీనటులు, రాజకీయ నేతలు, సామాన్య జనంతో పాటు ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తప్పుబట్టాయి. అయితే ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం డిఫరెంటుగా స్పందించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానట్లు తెలిపారు. దేశంలో అసంహనం పెరుగుతోందని, తనపై సున్నీ మస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారీ చేసినపుడు దాదాపు తనలోనూ ఇలాంటి భయమే కలిగిందన్నారు.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ....వృత్తి ధర్మంలో భాగంగా చేసే పనికి తీవ్ర విమర్శలకు గురైనపుడు తాను కూడా ఇలాంటి అసహన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మతం పేరుతో చేసే హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని, నాగరిక ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనేది ఉండ కూడదు అన్నారు.

మహ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా తీసిన ‘ది మెుసెంజర్ ఆఫ్ గాడ్' అనే ఇరానీ చిత్రానికి రెహమానం సంగీతం అందించడం అప్పట్లో వివాదానికి కారణమైంది. ఈ సినిమా ముస్లింల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని సున్నీ ముస్లిం సంస్థ రజా అకాడమీ రెహమాన్ తో పాటు, చిత్ర దర్శకుడు మాజిద్ మజీదీకి ఫత్వా జారీ చేసింది. ఆ సమయంలో పలువురు రెహహాన్ ను తిరిగి హిందూ మతంలోకి రావాలని ఆహ్వానించారు.

English summary
After being criticised for his recent comment on "rising intolerance" in India, Aamir Khan has reportedly asked his wife Kiran Rao and their child to leave Mumbai for a few days. After Aamir's remark on growing despodency in India, protests were started outside his house after which the actor felt his wife and child are not safe in Mumbai at the moment.
Please Wait while comments are loading...