twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దంగల్ చరిత్ర సృష్టించింది. : ఫోర్బ్స్ ధృవీకరించింది

    ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. ఈ విష‌యాన్ని ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ కూడా ధృవీక‌రించింది.

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. ఈ విష‌యాన్ని ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ కూడా ధృవీక‌రించింది. చైనాలో 53వ రోజు రూ.2.5 కోట్లు వసూలు చేసిన దంగ‌ల్‌.. ఈ అరుదైన మార్క్‌ను అందుకున్న‌ట్లు ఫోర్బ్స్ వెల్ల‌డించింది.

    ఇండియాలో కంటే దాదాపు రెట్టింపు వ‌సూళ్లు

    ఇండియాలో కంటే దాదాపు రెట్టింపు వ‌సూళ్లు

    ఈ క్ర‌మంలో దంగ‌ల్ మ‌రో ఘ‌న‌త‌ను కూడా సాధించింది. హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ సినిమాల క‌న్నా ఎక్కువ వ‌సూళ్లు దంగ‌ల్ రాబ‌ట్టింది. దంగ‌ల్ ఒక్క చైనాలోనే 1200 కోట్ల‌కుపైగా వ‌సూలు చేయ‌డం విశేషం. ఇండియాలో కంటే దాదాపు రెట్టింపు వ‌సూళ్లు చైనాలోనే సాధించింది.

    షావుయ్ జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్‌)

    షావుయ్ జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్‌)

    ఒక్క‌రోజు క‌లెక్ష‌న్లే రూ.87.66 కోట్లు అంటే చైనాలో దంగ‌ల్ సృష్టిస్తున్న ప్ర‌భంజ‌నాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. చైనాలో షావుయ్ జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్‌) పేరుతో మే 5న‌ దంగ‌ల్ రిలీజైంది. 9 రోజుల్లోనే ఈ మూవీ క‌లెక్ష‌న్లు రూ.300 కోట్లు దాటింది. చైనాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఇండియ‌న్ మూవీగా దంగ‌ల్ రికార్డు సృష్టించింది. చైనాలోని 9 వేల థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ.. తొలి వారంలోనే రూ.200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్లు సాధించింది.

    3 ఇడియట్స్

    3 ఇడియట్స్

    దీన్ని బట్టి ఆమిర్‌ఖాన్‌కు చైనాలో ఉన్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ నటించిన ‘3 ఇడియట్స్' సినిమా కూడా చైనాలో బాగా ఆడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా చైనాలో ఆమిర్‌కే సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు.

    హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్

    హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్

    హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్.. కెప్టెన్ అమెరికా, ట్రిపుల్ ఎక్స్‌, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌, టైటానిక్ 3డీ, ద జంగిల్ బుక్‌, కుంగ్ ఫు పాండా 3 లాంటి సినిమాల క‌ంటే అధికంగా వ‌సూళ్లు రాబట్టిన చిత్రంగా దంగ‌ల్ నిలవడం మరో విశేషం. వందకోట్ల లోపు బడ్జెట్ (70 కోట్లు) తోనే ఇంతటి ఘనతా సాధించటం కూడా గమనించాల్సిన విషయం.

    భాష, ప్రాంతం అనే భేదం లేకుండా

    భాష, ప్రాంతం అనే భేదం లేకుండా

    చైనాలో దంగల్ విజయంపై బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ స్పందించాడు. ప్రపంచవ్యాప్తంగా భాషకు, సంస్కృతికి ఎలాంటి పరిమితులు లేవని దంగల్ సినిమా నిరూపించింది. ఇండియాలోనే కాదు చైనాలో కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్‌తో కూడిన చిత్రానికి భాష, ప్రాంతం అనే భేదం లేకుండా చూస్తున్నారు అని అమీర్ ఖాన్ అన్నారు.

    English summary
    Aamir Khan starrer has broken yet another record by becoming the first Indian movie to earn Rs 2000 crore worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X