»   » అమీర్ ఖాన్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు : సల్మాన్ వల్లే అంటూ

అమీర్ ఖాన్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు : సల్మాన్ వల్లే అంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలుతోంది ఖాన్ త్రయం. వీరిలో ఒకప్పుడు షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. తర్వాతి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండేవాడు. అమీర్ ఖాన్ ది మూడో స్థానం. ఐతే తర్వాతి కాలంలో నెంబర్లు మారాయి. లగాన్.. రంగ్ దె బసంతి లాంటి సినిమాలతో అమీర్ నెమ్మదిగా తన ఇమేజ్ పెంచుకుని రెండో స్థానానికి వస్తే..

వరుసగా చెత్త సినిమాలు చేసిన సల్మాన్ ఖాన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంకొన్నేళ్లు గడిచాక అమీర్ ఖాన్ ఏకంగా అగ్రస్థానానికి దూసుకెళ్లిపోయాడు. "వాంటెడ్" దగ్గర్నుంచి పుంజుకున్న సల్మాన్.. వరుస హిట్లతో షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు బాలీవుడ్లో నిస్సందేహంగా అమీరే నెంబర్ వన్. అతడి సినిమాల్ని చూసి వేరే వాళ్లు భయపడాల్సిందే కానీ.. అతను వేరే సినిమాల్ని చూసి కంగారు పడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుదు అమీర్ స్వయంగా సల్మాన్ ని మెచ్చుకున్నాడు సల్మాన్ నటన అద్బుతం అంటూ ఆకాశానికెత్తుతున్నాడు.

Aamir Khan cry Again After Watching Salman Khan's Sultan

అత‌ని లేటెస్ట్ మూవీ సుల్తాన్ త‌న‌తో కంట‌త‌డి పెట్టించింద‌న్నాడు. సినిమాలో స‌ల్మాన్ న‌ట‌న అద్భుత‌మ‌ని, ఈ సినిమా బాలీవుడ్‌లో అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంద‌ని అమీర్ అన్నాడు. య‌శ్‌రాజ్ సంస్థ ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించిన ఈ సినిమాను బుధ‌వారం రాత్రి చూశాడు అమీర్‌ఖాన్‌. సినిమా అయిపోగానే తాను స‌ల్మాన్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ మెసేజ్ చేశాన‌ని చెప్పాడు.

గ‌తేడాది స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన భ‌జరంగీ భాయ్‌జాన్ సినిమా చూసిన త‌ర్వాత కూడా అమీర్ ఇలాగే ఏడ్చేశాడు. సల్మాన్ ఖాన్ ఇప్పటివకు చేసిన చిత్రాల్లో భజరంగీ ది బెస్ట్ అని కొనియాడారు. హర్షాలీ నటన కూడా బాగుంద‌ని. చెబుతూ క్లైమాక్స్ సన్నివేశాల్లో సల్మాన్ నటనకు మ‌న‌స్సును తాకింద‌ని కన్నీళ్ళు పెట్టుకున్నాడు అమీర్.

భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్ సినిమాల‌ను పోల్చలేమ‌ని, రెండు అద్భుత‌మైన సినిమాల‌ని అమీర్ అన్నాడు. సుల్తాన్ అయితే అసాధార‌ణ సినిమా.. న‌న్నుబాగా క‌దిలించింది. సెకండాఫ్‌లో నేను ఏడ్చేశాను అంటూ అమీర్ మీడియాతో చెప్పాడు. అనుష్క న‌ట‌న కూడా చాలా బాగుంద‌ని కొనియాడాడు. ఈ ప్ర‌త్యేక షోని అమీర్‌తోపాటు స‌ల్మాన్ మాజీ ల‌వ‌ర్ క‌త్రినాకైఫ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, అత‌ని భార్య‌, అర్ష‌ద్ వార్సీ, భ‌జ‌రంగీ భాయ్‌జాన్ డైరెక్ట‌ర్ క‌బీర్‌ఖాన్ కూడా చూశారు.

Aamir Khan cry Again After Watching Salman Khan's Sultan

తన సినిమా దంగల్ కూడా ఇంకో మల్ల యోధుడి కథ తో వస్తున్నదే. అదే సమయం లో ఇంకో మల్లుడి కథతో వచ్చిన "సుల్తాన్" తన సినిమాకి గట్టి పోటీ అవుతుందని భయం అమీర్ లో లేకపోలేదు. అయినా తన సాటి నటున్ని మనస్పూర్థిగా మెచ్చుకున్నాడు అమీర్...

English summary
Sultan is outstanding, moving, cried in second half. It is a very inspiring film, "I messaged him at night, congratulating him. It deserves success. Sultan will break all records, I am sure" Aamir told reporters on Thursday in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu