»   »  షూటింగులో గాయపడ్డ హీరో అమీర్ ఖాన్

షూటింగులో గాయపడ్డ హీరో అమీర్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ షూటింగులో గాయపడ్డారు. ప్రస్తుతం 'దంగల్' చిత్రంలో నటిస్తున్న ఆయన షూటింగులో భాగంగా రెజ్లింగ్ ప్రాక్టీసు చేస్తుండగా కండరాలకు గాయమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లూథియానాలో జరుగుతోంది. ఈ ఘటనతో షూటింగ్ వాయిదా పడగా, అమీర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

అభిమానులు స్వల్ప గాయమే అని, ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ చిత్రాన్ని మహావీర్ సింగ్ పోఘట్ అనే రెజ్లర్ జీవిత చరిత్ర ఆధారంగా నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. భిన్నమైన కథలను ఎంచుకుని సామాజిక స్పృహ కలగించేందుకు ప్రయత్నించే అమీర్ ఖాన్ ‘దంగల్' చిత్రంలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారు.

Aamir Khan gets muscle spasm during 'Dangal' film shoot

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. బురద మట్టిలో రౌద్రం తో ఉన్న అమీర్ లుక్ అందరిలో ఆసక్తిని నెలకొల్పింది. ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. పీకే తరహాలో ఈ చిత్రంలోనూ ఆమిర్ విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకోసం అమీర్‌ఖాన్ పాత్ర నేటివిటీకి అనుగుణంగా ఉండేలా భారీగా 20కిలోల బరువు పెరిగారు. దంగల్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నుంచే అంచనాలు అమాంతం పెంచేసుకుంటున్న పీకే ఖాన్ తాజా పోస్టర్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పీకే లో నటించిన అనుష్కశర్మ మరోసారి అమీర్ సరసన జతకడుతున్నారు.

English summary
Bollywood actor Aamir Khan was on Saturday injured on sets while shooting for his upcoming movie ‘Dangal’ in Ludhiana.
Please Wait while comments are loading...