For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెల్ డన్ అమీర్ ఖాన్...

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ‘అసహనం' అంశంపై అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికే దారి తీసింది. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శల వర్షం వెల్లువెత్తుతోంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఈ లిస్టులో చేరారు.

  దీనిపై హృతిక్ రోషన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘జరిగిన పరిణామాలను బట్టి నేను ఒక విషయం నేర్చుకున్నాను. నీపై దాడి జరుగుతున్నా కూడా స్పందించడానికి తప్పక పవర్ కోసం వెతకాలి. రియాక్ట్ కాకూడదు. వెల్ డన్ అమీర్ ఖాన్ అంటూ తన మనసులోని మాట బయట పెట్టాడు హృతిక్ రోషన్.

  బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ స్పందిస్తూ... ‘సెలబ్రిటీలకు తప్ప ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండే హక్కు ఉంది. ఇది నా అభిప్రాయం కాదు. ఎందుకంటే నేను ఇలాంటి వాటికి విరుద్దమైనవాడిని. అసలు మద్దతు ఇవ్వను' అని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

  కాగా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్, రవీనా టండన్, రామ్ గోపాల్ వర్మ, పరేష్ రావల్, అశోక్ పండిత్ తదితరులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం అమీర్ ఖాన్ కు సపోర్టుగా నిలిచారు.

  Aamir Khan and Intolerance Controversy:Bollywood actor Hrithik Roshan breaks silence

  పూరి జగన్నాథ్ ఈ విషయమై ట్వీట్ చేసారు. అమీర్ ఖాన్ బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఓ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని పూరి కామెంట్ చేసారు. అంతటితో ఆగని పూరి...అమీర్ ఖాన్ సెలబ్రిటీ కావడం వల్లే ఆయనపై గొందు చించుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఆల్ ఖైదా లేదా ఐసిస్ లాంటి వాటిల్లో ఉంటే ఏ భారతీయుడైనా ఇలాంటి నాన్సెన్స్ సృష్టించే ధైర్యం చేసే వాడా? అంటూ పూరి ట్వీట్ చేసారు.

  ఇటీవల ఓ ఈవెంటులో పాల్గొన్న వెంకటేష్ మీడియాతో ఈ విషయమై స్పందించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ విషయంలో అతిగా, లేనిది ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తోంది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను అని వెంకటేష్ అన్నారు.

  రెహమాన్ మద్దతు..
  అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఇతర నటీనటులు, రాజకీయ నేతలు, సామాన్య జనంతో పాటు ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తప్పుబట్టాయి. అయితే ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం డిఫరెంటుగా స్పందించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానట్లు తెలిపారు. దేశంలో అసంహనం పెరుగుతోందని, తనపై సున్నీ మస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారీ చేసినపుడు దాదాపు తనలోనూ ఇలాంటి భయమే కలిగిందన్నారు.

  అమీర్ ఖాన్ వివరణ..
  కాగా తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. నేను, నా భార్య ఈ దేశం విడిచి వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇక్కడే ఉంటాను, భారత గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రజల మధ్య సోదరభావం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ....వృత్తి ధర్మంలో భాగంగా చేసే పనికి తీవ్ర విమర్శలకు గురైనపుడు తాను కూడా ఇలాంటి అసహన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మతం పేరుతో చేసే హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని, నాగరిక ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనేది ఉండ కూడదు అన్నారు.

  English summary
  Aamir Khan has become the common target for all critics in the country. The Bollywood superstar has been facing criticism following his controversial statement on "intolerance" and "moving out of India". Despite stern criticism, abuses, Aamir received support from a few of his colleagues in Bollywood and Hrithik Roshan was one among them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X