»   » అమీర్ ఖాన్ కు తెగ నచ్చేసిందీ సినిమా,అద్బుతమంటూ పొగడ్తలు

అమీర్ ఖాన్ కు తెగ నచ్చేసిందీ సినిమా,అద్బుతమంటూ పొగడ్తలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తను చూసిన సినిమా బాగుంటే దాన్ని ప్రమోట్ చేయటానికి ఏ మాత్రం వెనకాడడు అమీర్ ఖాన్. తాజాగా ఆయన ఈ వారం విడుదల అవుతున్న థిథి (కన్నడ చిత్రం) చూసారు. ఆ సినిమా ఆయనకు తెగ నచ్చేసింది. ఆయన ట్విట్టర్ లో ఈ సినిమా గురించి అద్బుతంగా ఉందంటూ రాసుకొచ్చి, బూస్ట్ ఇచ్చారు.


ఇప్పటికే జాతీయస్దాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ చిత్రానికి ఈ అమీర్ ప్రశంశలు తప్పకుండా కలిసి వస్తాయి. నేషనల్ మీడియా కన్ను ఈ సినిమాపై పడేలా చేస్తాయనటంలో సందేహంలేదు. ఓ అద్బుతమైన చిత్రాన్ని చూసానంటూ ఆయన చెప్పి, నటినటులను పొగుడుతూ చేసిన ట్వీట్ ఆ టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది.
Aamir Khan praises Kannada movie 'Thithi'

అలాగే ఈ సినిమాలో పెద్ద స్టార్, తెలిసిన ప్రముఖ నటులు లేకపోయినా, చాలా బాగుందని, కొత్తవారైనా వారి నటన అద్బతమని అన్నారు. ఇక ఈ సినిమాలోని కథప్రకారం ..జనరేషన్ లో వస్తున్న మార్పులు, వారి ఆలోచన విధానాలు చూస్తూంటే కొంచెం కష్టమని అనిపించిననప్పటికీ, సినిమా మాత్రం ఫన్నీగా ఉందని, మిస్ కావద్దని ఆయన కోరారు.

Aamir Khan praises Kannada movie 'Thithi'

కర్ణాటకలోని ఓ గ్రామంలో వంద సంవత్సరాలు దాటి జీవితం సాగిస్తున్న సెంచరీ గౌడ అనే వ్యక్తి మరణంపై మూడు తరాలు ఎలా స్పందించారు. అతని మరణానంతరం పదకొండు రోజులు అంత్యక్రియలు ఎలా చేసారు అనే విషయం చుట్టు కథ జరుగుతుంది.

ఈ చిత్రం జాతీయ స్దాయి అవార్డుని మాత్రమే కాక, అంతర్జాతీయ స్దాయిలో ఇప్పటకే 12 అవార్డ్ లు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో జూన్ 3 న విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రతాప్ రెడ్డి నిర్మించారు.

English summary
Aamir, on his Twitter handle, wrote, "Hey guys, just saw one of the most amazing films I have seen in a long time! Thithi. (1/4), [sic]" and "It's a Kannada film, with subtitles in English. It's an absolute MUST WATCH! It's releasing in theatres on 3rd July. (2/4), [sic]" he continued.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu