»   » 'ఈగ' గురించి విని అమీర్ ఖాన్ ప్రశంసించారు: రాజమౌళి

'ఈగ' గురించి విని అమీర్ ఖాన్ ప్రశంసించారు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మిస్టర్ ఫెరఫెక్ట్ అమీర్ ఖాన్ ని రాజమౌళి కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్యన జరిగిన విషయాలని రాజమౌళి రీసెంట్ గా ట్విట్టర్ లో రాసారు. ఆ ట్వీట్ లో...అందరూ చెప్తున్నట్లుగానే "అమీర్ ఖాన్ డౌన్ టు ఎర్త్ పర్శన్. మేము చాలా సేపు మా ఇద్దరి భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నాము. ఆయు చాలా ఎక్సైట్మెంట్ ఫీలయ్యారు. అలాగే నేను నా ప్రస్తుత చిత్రం ఈగ గురించి చెప్పాను. ఆ ఆలోచనను ఆయన చాలా ప్రశంసించారు. నాకూ చాలా ఆనందం అనిపించింది. ఇక ఈ మీటింగ్ చాలా ఆలోచనలు, మాటలు మా మధ్య దొర్లాయి. ముఖ్యంగా ఫిల్మ్ మేకింగ్ లో జరిగే నాన్సెన్స్ లు, రాజకీయాలు, సమాజం,ప్రజలు వంటి టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇక ఆయన నా మగధీర చిత్రాన్ని ఎప్రిషియేట్ చేసారు. అలాగని ఆ రీమేక్ లో ఆయన చేస్తారని కాదు. నేను ముందే చెప్పాను ఇది ఓ క్యాజువల్ మీటింగ్ అని. ఎగ్జాట్ గా అదే జరిగింది అంటూ రాసుకొచ్చారు రాజమౌళి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu