twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్సీస్ మార్కెట్లో ప్రకంపనలు: దుమ్మురేపుతున్న బాహుబలి2, దంగల్..

    ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి2, దంగల్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తున్నాయి. బాహుబలి2 చిత్రం అమెరికా బాక్సాఫీస్‌ను కుదిపేస్తుండగా, చైనాలో దంగల్ చిత్రం..

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి2, దంగల్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా సవాల్ విసరడం గమనార్హం. బాహుబలి2 చిత్రం అమెరికా బాక్సాఫీస్‌ను కుదిపేస్తుండగా, చైనాలో దంగల్ చిత్రం రికార్డులను తిరుగరాస్తున్నది. చైనాలో దంగల్ ధాటికి గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ2 సినిమా కలెక్షన్లు కుదేలు అవుతున్నాయి.

    దంగల్ రికార్డు స్థాయిలో

    దంగల్ రికార్డు స్థాయిలో

    చైనాలో గత శుక్రవారం విడుదలైన దంగల్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నది. ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా దంగల్ రికార్డు సృష్టించింది. దంగల్ చిత్రం 3.91 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగా, హాలీవుడ్ చిత్రం గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ2 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేయడం గమనార్హం.

    చైనాలో భారతీయ చిత్రం

    చైనాలో భారతీయ చిత్రం

    చైనాలో భారతీయ చిత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడం చాలా గర్వంగా ఉంది. గతంలో దంగల్ చిత్రం రూ.744 కోట్లు వసూలు చేసింది. చైనాలో ప్రస్తుతం రూ.149 కోట్లు వసూలు చేసి 912 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. రూ.1000 కోట్ల చిత్రంగా రికార్డును స్థాపించేందుకు పరుగులు పెడుతున్నది అని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

    చైనాలో దంగల్

    చైనాలో దంగల్

    చైనాలో దంగల్ మొదటి రోజు 2.33 మిలియన్ డాలర్లు, రెండో రోజున 4.69 మిలియన్ డాలర్లు, మూడో రోజున 5.55 మిలియన్ డాలర్లు, నాలుగో రోజున 3.04 మిలియన్ డాలర్లు, ఐదో రోజున 3.52 మిలియన్ డాలర్లు, ఆరో రోజున 3.91 మిలియన్ డాలర్లు రాబట్టడం గమనార్హం.

    అమెరికాలో బాహుబలి

    అమెరికాలో బాహుబలి

    కాగా అమెరికాలో బాహుబలి చిత్రం రికార్డుస్థాయి కలెక్షన్లను రాబడుతున్నది. ఇప్పటికే రూ.100 కోట్ల మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 రూ.1200 కోట్లు వసూలు చేయడం గమనార్హం. అమెరికాలో బాహుబలి2 17 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల మైలురాయిని దాటింది. కలెక్షన్ల వసూలు ఏమాత్రం తగ్గడం లేదు అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ అదర్శ్ ట్వీట్ చేశారు.

    English summary
    Baahubali2 is breaking records in the US box office having trumped a Tom Hanks film in the very first week of its release, Aamir Khan’s Dangal has trumped a Marvel superhero caper all the way in China. On Wednesday, Aamir Khan’s wrestling drama outran Guardians of Galaxy Vol 2 at the China box office, according to reports. This was day six of release for both the films in China.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X