»   »  వేల కోట్ల వసూళ్లు.... దేశంలో ఒకే ఒక్కడు, ఎవరా స్టార్ హీరో?

వేల కోట్ల వసూళ్లు.... దేశంలో ఒకే ఒక్కడు, ఎవరా స్టార్ హీరో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ దూసుకెలుతున్నాడు. కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ సినిమాల రికార్డులు బద్దలు కొట్టడం మరే హీరోకు సాధ్యం కావడం లేదు. తన సినిమాల రికార్డులను తానే బద్దలు కొడుతూ అమీర్ ఖాన్ నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు.

అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దంగల్'. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 500 కోట్ల మార్కును అందుకుంది. త్వరలోనే అమీర్ ఖాన్ తన గత సినిమా 'పికె' రికార్డును బద్దలు కొడతారని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

2008లో అమీర్ ఖాన్ 'గజనీ' చిత్రంతో రికార్డుల పరంపర మొదలు పెట్టాడు. ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన సినిమాలు 2వేల కోట్లకుపైగా వసూలు చేసాయి.

 గజినీతో నేషనల్ రికార్డ్

గజినీతో నేషనల్ రికార్డ్

2008లో ‘గజినీ' సినిమాతో అమీర్ ఖాన్ నేషనల్ రికార్డ్ నెలకొల్పాడు. ఆ చిత్రం భారత్‌లో 200 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డుల కెక్కింది. అప్పటి వరకు అన్ని వసూళ్లు ఏ ఇండియన్ సినిమాకు రాలేదు.

 3 ఇడియట్స్

3 ఇడియట్స్

గజినీ సినిమాతో తాను నెలకొల్పిన రూ. 200 కోట్ల రికార్డును... తర్వాతి ఏడాది ‘3 ఇడియట్స్' సినిమాతో మళ్లీ తానే బద్దలు కొట్టాడు అమీర్ ఖాన్. 3 ఇడియట్స్ సినిమా రూ. 400 కోట్లు వసూలు చేసింది.

 ధూమ్-3

ధూమ్-3

3 ఇడియట్స్ 400 కోట్ల రికార్డును నాలుగేళ్ల వరకు ఏ హీరో టచ్ చేయలేదు. మళ్లీ 2013లో ధూమ్-3 సినిమా తాను బద్దలు కొట్టాడు అమీర్ ఖాన్. ఈచిత్ర రూ. 530 కోట్లు వసూలు చేసింది.

 పికె

పికె

తన ధూమ్-3 రూ. 530 కోట్ల రికార్డును మళ్లీ తన పికె సినిమాతో బద్దలు కొట్టాడు అమీర్ ఖాన్. పికె ఈ చిత్రం రూ. 730 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

 దంగల్

దంగల్

ప్రస్తుతం దంగల్ మూవీతో మరోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టలా ఉన్నాడు అమీర్ ఖాన్. దంగల్ మూవీ ఇప్పటికీ 500 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే ఈచిత్రం పికె రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

English summary
Bollywood film Dangal is creating records internationally in collections. The film was released on December 23 and collected Rs 465 cr gross. As the film touched Rs 500 cr mark in nine days, Aamir Khan and the film unit are very much happy. Trade analysts say that the film may cross Rs 720 cr mile stone.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu