»   » బాహుబలి2కి దంగల్ షాక్.. బాక్సాఫీస్ యుద్ధం మొదలైంది.. 9 వేల స్క్రీన్లలో అమీర్ సినిమా!

బాహుబలి2కి దంగల్ షాక్.. బాక్సాఫీస్ యుద్ధం మొదలైంది.. 9 వేల స్క్రీన్లలో అమీర్ సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాక్సాఫీస్ వద్ద అసలు యుద్దం ఇప్పుడే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తుంటే, బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన సత్తాను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే అమీర్ ఖాన్ నటించిన పీకే వసూలు చేసిన రూ.792 (గ్రాస్) కోట్లను బాహుబలి తిరుగరాసింది. ఈ నేపథ్యంలో దంగల్ చైనాలో రికార్డు స్థాయిలో 9 వేల స్క్రీన్లలో శుక్రవారం (మే 5వ తేదీన) విడుదలవ్వడం రికార్డుగా నమోదైంది.

నోట్ల రద్దు సమయంలో..

నోట్ల రద్దు సమయంలో..

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016 డిసెంబర్‌ 23న విడుదలైంది. నోట్ల రద్దు అనంతరం అనేక సినిమాలు కుప్పకూలితే.. దంగల్ మాత్రం సంచలన విజయం నమోదు చేసుకొన్నది. డిమానిటైజేషన్ తర్వాత నెలకొన్న పరిస్థితుల ఎదురించి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 744 కోట్లు వసూలు చేసింది. పీకే సాధించిన రూ.792 కోట్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

చైనాలో అమీర్‌ హవా..

చైనాలో అమీర్‌ హవా..

చైనా మూవీ మార్కెట్‌లో మరే బాలీవుడ్ నటుడికి లేని విధంగా అమీర్ ఖాన్ మంచి మార్కెట్ ఉంది. గతంలో పీకే చిత్రం చైనాలో దాదాపు 4 వేల స్క్రీన్లలో విడుదలైంది. దాదాపు వంద కోట్ల రూపాయాలను కలెక్ట్ చేసింది. చైనా వ్యాప్తంగా దాదాపు 40 స్క్రీన్లు ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన బీజింగ్ పిల్మ్ ఫెస్టివల్‌లో దంగల్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కోసం అమీర్ ఖాన్ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

9 వేల స్క్రీన్లలో..

9 వేల స్క్రీన్లలో..

ఈ శుక్రవారం (మే 5న) దంగల్ చిత్రం ష్యూ జియో బాబా (కుస్తీ పట్టు పడుదామా నాన్నా అని అర్థం) పేరుతో దాదాపు 9 వేల స్కీన్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి విడుదలైన స్కీన్లతో ఈ మొత్తం సమానం. దీన్ని బట్టి చైనాలో అమీర్ ఖాన్‌కు ఉన్న స్టామినా ఎంటో మరోసారి స్పష్టమైంది.

ఫోగట్ జీవిత కథ ఆధారంగా..

ఫోగట్ జీవిత కథ ఆధారంగా..

హర్యానాకు చెందిన కుస్తీ యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తన కూతుర్లకు ఫోగట్ స్వయంగా కుస్తీ శిక్షణ ఇచ్చి ప్రపంచ చాంపియన్లుగా తయారు చేసిన వాస్తవ కథ ఆధారంగా దంగల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా పరిశ్రమలో దంగల్ నమోదు చేసిన రికార్డులును ఇటీవల విడుదలైన బాహుబలి ది కన్‌క్లూజన్ తిరగరాసింది.

చైనాలో ఇది ఓ రికార్డు..

చైనాలో ఇది ఓ రికార్డు..

చైనాలో అమీర్ ఖాన్‌కు ఉన్న ప్రేక్షకాదరణ దృష్ట్యా దంగల్ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దంగల్ చిత్రాన్ని చైనాలో 9 వేల థియేటర్లలో విడుదల చేశాం. ఇతర దేశాల్లో భారతీయ చిత్రం సాధించిన అరుదైన రికార్డు ఇది. ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అనే విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించే కథా బలం ఉన్న సినిమా ఇది అని డిస్నీ ఇండియా వైస్ ప్రసిడెంట్, చిత్ర సహనిర్మాత అమృత పాండే మీడియాతో అన్నారు.

English summary
China audience show great respose to Aamir Khan films. His 2016 blockbuster Dangal is going to open across a breath-taking 9,000 screens this Friday. Amrita Pandey, Vice President of Dangal's co-producer Disney India, as saying, "Dangal will release in China in 9,000 screens - which is the widest ever release for an Indian film in any territory. We are very excited to release Dangal in Chin".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu