»   » రికార్డ్: ఎక్కువ మంది చూసిన ట్రైలర్ అదే

రికార్డ్: ఎక్కువ మంది చూసిన ట్రైలర్ అదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘పికె' ట్రైలర్ యూట్యూబులో ఎక్కువ మంది చూసిన ఇండియన్ మూవీ ట్రైలర్ గా రికార్డుల కెక్కింది. అక్టోబర్ 23, 2014న విడుదలైన ఈ ట్రైలర్ ను ఇప్పటి వరకు కోటి 22 లక్షల మందికిపైగా వీక్షించారు. సినిమా కూడా బాలీవుడ్లో భారీ విజయం సాధించింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘పికె' తర్వాతి స్థానంలో అజయ్ దేవగన్ ‘యాక్షన్ జాక్షన్', బిపాసా బసు హారర్ మూవీ ‘ఎలోన్' నిలిచాయి. అక్షయ్ కుమార్ నించిన ‘బేబీ' ట్రైలర్ ఆరో స్థానం దక్కించుకోగా, ‘రాయ్' ఏడో స్థానంలో నిలించింది. ఇక సైఫ్ అలీ ఖాన్-ఇలియానా నటించిన ‘హ్యాపీ ఎండింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిలైనా ట్రైలర్ మాత్రం ఈ లిస్టులో 8వ స్థానం దక్కించుకుంది.

 Aamir Khan's 'PK' tops list of 10 most viewed movie trailers on YouTube

దీంతో పాటు వరుణ్ ధావన్ నటించిన ‘బద్లాపూర్' టీజర్ తొమ్మిదో స్థానంలో, మహేష్ భట్ మూవీ ‘కామోషియాన్' పదో స్థానంలో నిలిచింది. ఇండియాలో వ్యూవర్ షిప్, పేయిడ్ వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్, ఆడియన్స్ రిటెన్షన్ ఆధారంగా ఈ ర్యాకింగ్స్ ఇచ్చినట్లు యూట్యూబ్ పేర్కొంది.

పికె చిత్రం విషయానికొస్తే...
రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో అమీర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రం ఘన విజయం సాధించి బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ కురిపించింది. డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.620 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో 'ధూమ్‌3' (రూ.547 కోట్లు) అత్యధిక వసూళ్ల రికార్డు బద్దలైంది.

English summary
Aamir Khan-starrer 'PK' has topped the list of YouTube's most viewed movie trailers. The film is followed by Ajay Devgn's 'Action Jackson' and Bipasha Basu's horror outing 'Alone'. The two minutes thirteen second-long trailer of 'PK', which released on October 23, has so far garnered 12,207,328 views on YouTube. The film hit cinema screens on December 19, last year.
Please Wait while comments are loading...