twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్న తండ్రిలా అన్నీ తానై... ఆ లేడీ డీఎస్పీ పెళ్ళికోసమే అమీర్ ఖాన్: ఎందుకని..!? (ఫొటోలు)

    ఈ నెల నవంబర్ 20న మహవీర్ స్వగ్రామం హర్యానా బలాలిలో జరిగే గీతా వివాహ వేడుకకు కావాల్సినవన్నీ అమీర్ ఖాన్ సమకూర్చుకుతున్నాడు. గీతకు పెళ్లిబట్టలతో పాటూ ఇతర బహుమతులనూ సిద్ధం చేశాడు. అంతేకాక ఆమె వివాహాన్ని దగ

    |

    బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్.. లెజండ‌రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత నేపథ్యంలో దంగల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ నేప‌థ్యంలో త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి పాత్రలో అమీర్ నటించాడు. పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్ తో మరోసారి అభిమానులు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం అమీర్ బాగానే కసరత్తులు చేస్తున్నాడు

    తన చిత్రాలు విడుదలయ్యే ముందు ప్రమోషన్‌ వ్యూహాలు రచించడంలో ఆమిర్‌ దిట్ట. అందుకే తన సినిమాకి రియల్ హీరో అయిన మహావీర్ సింగ్ కూతురు గీతా పోగట్ పెళ్లికి హాజరై చిత్రంపై అంచనాలు పెంచేందుకే ఇదంతా చేస్తున్నాడని బీటౌన్‌లో టాక్‌! చిత్ర షూటింగ్‌ సమయంలో బబిత, గీతాతో ఆమీర్‌ ఎక్కువగా గడిపారు. వారితో మంచి అనుబంధం వుంది. అందుకే మహవీర్ కుమార్తె గీతా ఫోగట్ వివాహానికి అంతా తానై వ్యవహరిస్తున్నాడు. అంతేకాక సంప్రదాయబద్ధంగా పెళ్లి కుమార్తెకు తండ్రి సమర్పించాల్సిన దుస్తులు కూడా అమీరే అందిస్తున్నాడు. ఆ వెడ్డింగ్ డ్రస్ లోనే రెజ్లర్ గీతా వివాహం చేసుకోనుంది. ఈ రెజ్లర్ కుటుంబం గురించి మరికొన్ని విశేషాలు...

     కుస్తీ వీర నారులు

    కుస్తీ వీర నారులు


    దేశంలోనే ఆడపిల్లల నిష్పత్తిలో అట్టడుగు స్థానం హరియాణాది. అక్కడ పురుషాధిక్యత ఎక్కువగా ఉండే జిల్లాల్లో బివానీ ఒకటి. అందులో దూరంగా విసిరేసినట్లుండే గ్రామం బలాలి. ఆ పల్లెటూళ్లొని ఒకే ఇంట్లో ఆరుగురు ఆంతర్జాతీయ కుస్తీ వీర నారులు పుట్టారు. వూళ్లొ చాలామంది ఛాంపియన్లు తయారవుతున్నారు. ఆటలో కంటే తరతరాల స్త్రీ వివక్ష పైన వాళ్లు సాధిస్తోన్న విజయాలూ, ఇతరులకు నేర్పిస్తోన్న పాఠాలే గొప్పవి. అందుకే ఆ కథను బాలీవుడ్‌ చిత్రంగానూ తెరకెక్కిస్తున్నాడు ఆమిర్‌ఖాన్‌

     తోలి భారతీయ యువతి:

    తోలి భారతీయ యువతి:


    ఒక పల్లెటూరి ఇంట్లో ఆరుగురు అమ్మాయిలు. అందరూ అంతర్జాతీయ కుస్తీ వీరనారులు. దేశంలో ఆడపిల్లల నిష్పత్తిలో అట్టడుగున ఉన్న హర్యానా లోని బలాలి గ్రామంలో పుట్టిన ఈ అమ్మాయిలు చరిత్రను తిరగరాశారు. కామన్ వెల్త్ క్రీడల్లో కుస్తీ లో స్వర్ణం సాధించిన తోలి భారతీయ యువతి గీతా ఫోగట్. ఇంకో అమ్మాయి బబితా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్. ఈ ఇద్దరితో పాటు రీతూ ప్రియాంక, సంగీత.

     అంతర్జాతీయ పతకాలు:

    అంతర్జాతీయ పతకాలు:


    రియో ఒలంపిక్స్ తో మోకాలి గాయంతో వెనుదిరిగిన వీనేస్ ఫోగట్ వీళ్ళందరూ అక్కాచెల్లెళ్లు. అంతర్జాతీయ పతకాలు గెలిచినవాళ్లు. వీళ్ళ తండ్రి మహావీర్ జాతీయ కుస్తీ క్రీడాకారుడు. తన క్రీడా వారసత్వాన్ని కొనసాగించటం కోసం తన కూతుళ్ళనే తీర్చిదిద్దాడు. ఈ ఆరుగురూ అంతర్జాతీయ రెజ్లర్లు గా ఎదిగారు.

     గీతా ఫోగ‌ట్‌:

    గీతా ఫోగ‌ట్‌:


    మహావీర్ పెద్ద కూతురు గీతా ఫోగ‌ట్‌. మాజీ రెజ్లింగ్ క్రీడాకారిణి. 2009, 2011 ల‌లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియ‌న్ షిప్ పోటీల‌లో రెండు సార్లు గోల్డ్ మెడ‌ల్‌ను సాధించింది. ఢిల్లీలో 2010లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్‌మెడ‌ల్‌తోపాటు, 2013లో అదే గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌ను సాధించింది. అంతేకాదు 2012లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో కాంస్య ప‌త‌కం కైవ‌సం చేసుకుంది.

     పోలీస్ విభాగంలో డీఎస్‌పీ:

    పోలీస్ విభాగంలో డీఎస్‌పీ:


    ఇదే కాకుండా 2012లో లండ‌న్‌లో జ‌రిగిన ఒలంపిక్స్‌లో 55 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల‌కు క్వాలిఫై కూడా అయింది. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి భార‌తీయ మ‌హిళా రెజ్ల‌ర్‌గా గీతా ఖ్యాతిని కూడా సొంతం చేసుకుంది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ లండ‌న్ ఒలంపిక్స్‌లో మెడ‌ల్ సాధించ‌లేక‌పోయింది. అయినా ఆటలో ఆమె చూపిన పోరాట ప‌టిమ అనిర్వ‌చ‌నీయం. అందుకే హ‌ర్యానా ప్ర‌భుత్వం ఆమెకు ఉన్న‌త స్థాయి ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది.హ‌ర్యానా పోలీస్ విభాగంలో డీఎస్‌పీగా ఆమెను అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా నియ‌మించింది

    గీతా వివాహ వేడుక:

    గీతా వివాహ వేడుక:

    ఈ నెల నవంబర్ 20న మహవీర్ స్వగ్రామం హర్యానా బలాలిలో జరిగే గీతా వివాహ వేడుకకు కావాల్సినవన్నీ అమీర్ ఖాన్ సమకూర్చుకుతున్నాడు. గీతకు పెళ్లిబట్టలతో పాటూ ఇతర బహుమతులనూ సిద్ధం చేశాడు. అంతేకాక ఆమె వివాహాన్ని దగ్గరుండి జరిపించాలని నిర్ణయించుకున్నాడు. మహవీర్ జీవితచరిత్ర ఆధారంగానే అమీర్ ప్రధాన పాత్రలో 'దంగల్' చిత్రం తెరకెక్కింది. ఈ క్రమంలో అమీర్ వారి కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. మహవీర్ కుమార్తెలతోనూ ఆయన అనుబంధం బలపడింది. అందుకే అమీర్ గీత పెళ్లి పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు.
     దంగల్:

    దంగల్:


    కుస్తీ వీరుడు మహావీర్ ఫోగట్ నిజజీవితం ఆధారంగా నిర్మిస్తున్న సినిమా దంగల్. బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 20న మహావీర్ కుమార్తె, గీతా ఫోగట్ వివాహం జరుగుతుంది. ఆరోజు వేరే షూటింగ్ ఉన్నా పెళ్ళికి హాజరు అయ్యేందుకు షెడ్యుల్ రద్దు చేసుకున్నాడట అమీర్. చిత్ర దర్శకుడు నితీష్ తివారి, కుమార్తేలుగా నటించిన ఫాతిమా సనా షేక్, సన్యా మలోహ్త్రా సైతం ఈ వేడుకకి వస్తున్నారట.

     రెజ్లర్ పవన్ కుమార్‌:

    రెజ్లర్ పవన్ కుమార్‌:


    రెజ్లర్ పవన్ కుమార్‌తో నవంబర్ 20న గీతా పెళ్లి జరగనుంది. దంగల్ మూవీ కారణంగా గీతాతో అమీర్ ఖాన్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. గీతాని తన కూతురిలానే భావించే అమీర్ ఖాన్ ఆమెకి అద్దిరిపోయే కానుక ఇవ్వనున్నాడు. పెళ్లిరోజున గీతా ధరించబోయే వెడ్డింగ్ ఔట్‌ఫిట్‌ని అమీర్ ఖాన్ బహుమతిగా అందించనున్నట్టు తెలుస్తోంది.

     మూడు రోజులపాటు :

    మూడు రోజులపాటు :


    హర్యానాలో జరగనున్న ఈ వివాహవేడుకకి హాజరు కావాల్సిందిగా అమీర్ ఖాన్‌తో పాటు దంగల్ డైరెక్టర్ నీతేష్ తివారికి కూడా ఆహ్వానం అందింది. ఈ వివాహ వేడుకలో జరిగే ప్రతీ కీలక ఘట్టాన్ని దగ్గరుండి తిలకించేందుకు అమీర్ ఈ మూడు రోజులపాటు అక్కడే వుండనున్నట్టు సమాచారం.

     రెండు నెలల ముందే:

    రెండు నెలల ముందే:


    రెండేళ్ల కిందట 'పీకే' మూవీతో అమీర్ బాక్సాఫీసు రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ కాంట్రవర్శీలతో పాటు కలెక్షన్ల పరంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసింది. ఇప్పుడు 'దంగల్' తో 'అమీర్' మరోసారి అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.ఓ సినిమా రిలీజ్ కి రెండు నెలల ముందే రషెస్ చూసి, ఈ దశాబ్ద కాలం అత్యుత్తమ సినిమా అనే ధైర్యం చేశాడంటే ఆ సినిమా ఎంతటి ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి కామెంట్ 'దంగల్' సినిమాపై దర్శకుడు కరణ్ జోహార్ చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

     'పీకే' కన్నా గొప్పగా ఉంటుందా:

    'పీకే' కన్నా గొప్పగా ఉంటుందా:


    కరణ్ మాత్రమే కాకుండా షబానా ఆజ్మీ లాంటి మరికొందరు సెలబ్రెటీలు కూడా 'దంగల్' రషెస్ చూసి వావ్ అనేశారట. దీన్ని బట్టి 'దంగల్' మూవీ ఎలాంటి సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. 'దంగల్' మూవీ 'అమీర్' చేసిన '3 ఇడియట్స్', 'పీకే' కన్నా గొప్పగా ఉంటుందని బాలీవుడ్ సెలెబ్రిటీస్ అంటున్నారు. మామూలుగానే 'అమీర్' సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి.

     నలుగురు అమ్మాయిల తండ్రిగా:

    నలుగురు అమ్మాయిల తండ్రిగా:


    దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో 'దంగల్' పై అంచనాలు మరింత పెరిగాయి. అంకిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'అమీర్' నలుగురు అమ్మాయిల తండ్రిగా నటిస్తున్నాడు. మహవీర్ పొగట్ అనే రెజ్లర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 23న 'దంగల్' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

    English summary
    Mahavir Singh Phogat's eldest daughter, Geeta Phogat is soon to get married and Dangal star Aamir Khan is an important part of the festivities, with a special gift too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X