»   » అంటు వ్యాధి భారిన పడ్డ అమీర్ ఖాన్ దంపతులు

అంటు వ్యాధి భారిన పడ్డ అమీర్ ఖాన్ దంపతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్, ఆయన సతీమణి కిరణ్‌రావులు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. ఒకరి ద్వారా మరొకరికి అంటే వైరస్ కావడంతో.... వారు ఇంటి నుండి బయటికు వెళ్లడం లేదు, ఆదివారం పుణెలో పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సత్యమేవ జయతే వాటర్ కప్-2017' ఈవెంటుకు కూడా వారు దూరంగా ఉన్నారు.

  తమకు స్వైన్ ఫ్లూ వచ్చిన విషయాన్ని అమీర్ ఖాన్ అఫీషియల్ గా వెల్లడించారు. ఈ కారణంగానే తాము అవార్డు ఫంక్షన్ కు రాలేక పోయామని వివరణ ఇచ్చారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

  ఇతరులకు అంటించడం ఇష్టంలేకనే

  ఇతరులకు అంటించడం ఇష్టంలేకనే

  స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి, తాను పబ్లిక్ ప్రదేశాల్లో ఈ వ్యాధితో సంచరించడం వల్ల ఇతరులకు సోకే అవకాశం ఉంది, ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని అమీర్ ఖాన్ తెలిపారు.

  నా స్నేహితుడిని పంపుతున్నాను

  నా స్నేహితుడిని పంపుతున్నాను

  ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో తన బదులు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నా స్నేహితుడు షారూక్‌ను అడిగానని, అందుకు ఆయన అంగీకరించాడని ఆమిర్ ఖాన్ తెలిపారు.

  వారం రోజుల పాటు చికిత్స

  వారం రోజుల పాటు చికిత్స

  ప్రస్తుతం అమీర్ ఖాన్ దంపతులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ వ్యాధి నుండి అమీర్ ఖాన్ దంపతులు కోలుకునేందుకు వారం పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.

  వీడియో సందేశం

  వీడియో సందేశం

  అమీర్ ఖాన్ లేకుండానే ‘సత్యమేవ జయతే వాటర్ కప్-2017' జరిగింది. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ వీడియో సందేశాన్ని ఈ వెంటులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, నీతా అంబానీ, రాజీవ్ బజాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

  English summary
  Actor Aamir Khan and his wife Kiran Rao have contracted swine flu, and both of them are being treated at their residence in Mumbai. Mr Khan, through video-conferencing during the 'Satyamev Jayate Water Cup 2017' event organised this evening in Pune by his NGO Paani Foundation, revealed that he has been diagnosed with swine flu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more