»   »  పాక్ లో నా సినిమా వెయ్యను ఏం చేసుకుంటారో చేసుకోండి: అమీర్ ఖాన్

పాక్ లో నా సినిమా వెయ్యను ఏం చేసుకుంటారో చేసుకోండి: అమీర్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దంగల్ విషయంలో పాక్ సెన్సార్ బోర్డు పెట్టిన కండిషన్ కి తిక్కరేగిన అమీర్ ఖాన్ దంగల్ పాక్ లో ప్రదర్శించను పోమ్మన్నాడట. ఎందుకంటే పాక్ సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలని తీసేయమని చెప్పిందట అందుకే అసలు పాక్ లో సినిమా ప్రదర్శనే వదిలేసాడు అమీర్. ఇంతకీ వాళ్ళు తొలగించమన్న సీన్లు ఏమిటో తెలుసా?? ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే....

మనదగ్గర ఆడినంత క్రేజ్ తో

మనదగ్గర ఆడినంత క్రేజ్ తో

బాలీవుడ్ సినిమాలకి పాక్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మనదగ్గర ఆడినంత క్రేజ్ తోనూ అక్కడ కూడా మన సినిమాలు ఆడతాయి. అసలు ఇప్పుడైతే లాలీవుడ్ (పాక్ సినీ ఇండస్ట్రీ) ఉనికికే ప్రమాదం ఉందనీ అసలు భారతీయ సినిమాలు వద్దనీ అంటూ ఒక వర్గం బయల్దేరినా అవేవీ నిలబడలేదు.

ఉడీ ఉగ్రదాడుల తర్వాత

ఉడీ ఉగ్రదాడుల తర్వాత

అయితే ఉడీ ఉగ్రదాడుల తర్వాత భారత్ - పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలను విడుదల కానివ్వలేదు. అలాగే పాక్ నటులు భారతీయ సినిమాల్లో నటిస్తే వాటిని విడుదల కానిచ్చేది లేదని శివసేన, ఎంఎన్ఎస్‌లు పట్టుబట్టాయి.

వాతావరణాన్ని చెడగొట్టే సంఘటన

వాతావరణాన్ని చెడగొట్టే సంఘటన

చివరకు కొన్నాళ్ల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో ఇక్కడి సినిమాలు అక్కడ విడుదల కావడం మొదలైంది. అలాగే అక్కడి నటీనటులు ఇక్కడ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ వాతావరణాన్ని చెడగొట్టే సంఘటన మరోటి జరిగింది.

 పాక్‌లో విడుదల చేయడానికే ఇష్టపడటం లేదు

పాక్‌లో విడుదల చేయడానికే ఇష్టపడటం లేదు

నిజానికి దంగల్ సినిమాను పాక్ లో విడుదల చేసేందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉండి తమను సంప్రదిస్తున్నారని, కానీ ఆమిర్ మాత్రం సెన్సార్ బోర్డు నిర్ణయం తర్వాత అసలు సినిమాను పాక్‌లో విడుదల చేయడానికే ఇష్టపడటం లేదని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు.

పైరసీ కాపీలు

పైరసీ కాపీలు

అయినా పాక్ లో పైరసీ ముఠాలు చాలా ఎక్కువ, ఈపాటికే దంగల్ పైరసీ కాపీలు కోకొల్లలు గా పాక్ లో దొరుకుతున్నాయట. అయినా ఇప్పటికే 385 కోట్ల దాకా కొల్లగొట్టిన అమీర్ ఇప్పుడు పాక్ విడుదల చేస్తే మహా అయితే మరో 10-12 కోట్లు వస్తాయి. ఆమాత్రం దానికి సినిమాలో సీన్లు అదీ దేశగౌరవానికి సంబందించిన సీన్లు తీసేయమనటం తో తన ఆలోచన వెనక్కి తీసుకున్నాడట.

 దంగల్ క్లైమాక్స్ సీన్

దంగల్ క్లైమాక్స్ సీన్

ఇంతకీ వాళ్ళకొచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే దంగల్ క్లైమాక్స్ సీన్ అట. ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు ఆమిర్‌ఖాన్‌ను ఒక కోచ్ గదిలో పెట్టి బంధిస్తాడు. దాంతో తన కూతురు అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తోందోనన్న ఆందోళనతో ఆమిర్ కలవరపడుతుంటాడు.

సినిమాకే హైలెట్

సినిమాకే హైలెట్

అంతలో బౌట్ ముగిసిన తర్వాత భారత జాతీయగీతం వినిపిస్తుంది. కిటికీ లోంచి బయటకు చూస్తే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ పైన కనిపిస్తుంది. దాంతో తన కూతురు స్వర్ణపతకం సాధించిందన్న విషయం ఆమిర్‌కు తెలుస్తుంది. ఇది సినిమాకే హైలెట్ గా ఉన్న సీన్.

 భారత జాతీయగీతం

భారత జాతీయగీతం

ఆ సీన్ గనక లేకపోతే... మొత్తం సినిమా లో ఉన్న ఉద్విగ్నత అంతా దెబ్బతింటుంది.అయితే ఇందులో భారత జాతీయగీతంతో పాటు త్రివర్ణ పతాకం కనిపిస్తుందన్న కారణంతో ఆ సీన్ కట్‌ చేస్తేనే పాకిస్తాన్‌లో విడుదల చేయనిస్తామని అక్కడి సెన్సార్ బోర్డు పట్టుబట్టింది.

తొలగించే ప్రసక్తి లేదు

తొలగించే ప్రసక్తి లేదు

ఆ సీన్ తొలగిస్తేనే తప్ప విడుదల కానివ్వం అని తేల్చేసింది. అందులో పాకిస్తాన్‌ను కించపరిచేలా ఎలాంటి సన్నివేశం లేదని, పైగా అది సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశం కాబట్టి దాన్ని తొలగించే ప్రసక్తి లేదని సినిమాకు నిర్మాత కూడా అయిన ఆమిర్ స్పష్టం చేశాడు. అయినా ఒప్పుకోక పోవటం తో వొళ్ళుమండిన అమీర్ అసలు తన సినిమాను పాకిస్తాన్‌లో విడుదల చేసేదే లేదు పొమ్మనేసాడు.

English summary
"Pakistan had been very keen on releasing the film and several distributors had been talking to us, but after their censor came back with a demand for two cuts, Aamir Khan decided to stall the release," Khan's spokesperson told Media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu