»   » కూతురు చేసిన పనికి ఐశ్వర్యరాయ్ కన్నీళ్లు ఆగలేదు!

కూతురు చేసిన పనికి ఐశ్వర్యరాయ్ కన్నీళ్లు ఆగలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం 'సరబ్జీత్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగు దేశ సరిహిద్దు ప్రాంతాల్లో జరుగతోంది. ఈ క్రమంలో ఐ్వర్యరాయ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో షూటింగుకు సెలవు పెట్టేసి ఇంటికొచ్చేసింది ఐష్.

అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రతిరోజూ తన కూతురు ఆరాధ్యను స్కూల్ వదిలే సమయానికి వెళ్లి తనను స్వయంగా ఇంటికి వెంటబెట్టుకుని వస్తోంది. తల్లి అనారోగ్యాన్ని గమనించిన ఆరాధ్య తన క్లాస్ రూములో 'గెట్ వెల్ సూన్' అని రాసిన ఓ కార్డును స్వయంగా తయారు చేసి తనను తీసుకెళ్లడానికి స్కూలుకు వచ్చిన తల్లికి అందజేసింది. కూతురు నుండి ఆ కార్డు అందుకున్నవెంటేనే....ఐష్ మనసు ఆనందంతో పొంగిపోయింది. కూతురును గుండెలకు హత్తుకుంది. ఆనందంతో ఆమెకు కన్నీరు ఆగలేదట.

పిల్లలు చేసే ఇలాంటి పనులు ప్రతి తల్లిదండ్రులందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటాయి. ఆ సమయంలో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇపుడు అలాంటి అనుభూతులను తల్లిగా ఐశ్వర్యరాయ్ ఆస్వాదిస్తోంది. స్లైడ్ షోలో ఐశ్వర్యరాయ్ నటిస్తున్న సరబ్జీత్ చిత్రం విశేషాలు, ఫోటోలు...

కూతురుతో ఐష్

కూతురుతో ఐష్


తన ముద్దుల కూతురుతో కలిసి ఐశ్వర్యరాయ్.

సరబ్జీత్

సరబ్జీత్


పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ‘సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

డీగ్లామరస్ లుక్

డీగ్లామరస్ లుక్


ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ డీ గ్లామరస్ లుక్ లో కనిపించబోతోంది.

రణదీప్ హుడా

రణదీప్ హుడా


‘సరబ్జీత్‌' చిత్రం కోసం రణదీప్ ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడు. కేవలం 28 రోజుల్లో అతడు ఇంత భారీగా బరువు తగ్గడం విశేషం.

English summary
Aaradhya made a get-well-soon card in class and when the actor went to fetch her on Thursday as usual, she gave it to her at the gate. Aishwarya was so touched that she become emotional as did some of the other parents who had come to fetch their kids.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu