»   »  పవన్ మూవీ సాంగుతో... మరో టైటిల్ రిజిస్టర్

పవన్ మూవీ సాంగుతో... మరో టైటిల్ రిజిస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిట్ మూవీ 'గబ్బర్ సింగ్' చిత్రంలోని సాంగు లిరిక్స్ ఆధారంగా గత సంవత్సరం.....'కెవ్వు కేక', 'గుండెజారి గల్లంతయ్యిందే' లాంటి టైటిల్స్ రిజిస్టర్ అవడంతో పాటు సినిమాలుగా రూపొంది విడుదలైన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సంవత్సరం కూడా ఇదే తంతు మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఇందులో బాగా పాపులర్ అయిన 'ఆరడుగుల బుల్లెట్' సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆరడుగుల బుల్లెట్' పేరుతో ఫిల్మ్ చాంబర్లో టైటిల్ రిజిస్టర్ అయింది. అయితే ఇది ఎవరు రిజిస్టర్ చేయించారనేది తెలియాల్సి ఉంది.

మరి మున్ముందు పవర్ స్టార్ సినిమాలోని పాటల ఆధారంగా ఇంకెన్ని టైటిల్ వస్తాయో చూడాలి. ఇక అత్తారింటికి దారేది చిత్రం విషయానికొస్తే...పవన్ కల్యాణ్, సమంత జంటగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న 'అత్తారింటికి దారేది' అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఆగస్టు 7న విడుదలకు ముస్తాబవుతోంది.

పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Power star Pawan Kalyan's upcoming film Attarintiki Daredi The Songs released very recently is a buzz now. The album was a massive hit already. The latest and flash news is that, the lyric ‘Aardugula bullet’ has been registered as a title in film chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu