»   » ఆర్తి అగర్వాల్ జీవితంలో...ఎన్నో ఆటు పోట్లు!

ఆర్తి అగర్వాల్ జీవితంలో...ఎన్నో ఆటు పోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆర్తి అగర్వాల్.... 16 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగు పెట్టిన అందాల సుందరి అనతి కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. సినీ పరిశ్రమంలో ఒక మెరుపులా మెరిసిన హీరోయిన్‌ ఆర్తీ అగర్‌వాల్. అప్పట్లో విక్టరీ వెంకటేష్‌ పక్కన ‘నువ్వు నాకు నచ్చావ్‌' సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చిరి వరుసపెట్టి చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఇలా అందరితోనూ సినామాలు చేసింది.

అయితే ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎక్కువ కాలం నిలవలేదు. ఓ యువ హీరోతో ప్రేమలో పడటమే ఆమె కెరీర్ పతనానికి కారణమనే వాదన కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ప్రేమ సంబంధమైన గొడవలతో అప్పట్లో ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడటం కూడా సంచలనం సృష్టించింది. సదరు యువ హీరోతో లవ్ ఎఫైర్ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయి 2005లో ఆత్మహత్యాయత్నం చేసింది.

Aarthi Agarwal controversy life story

వరుసగా సినిమాలు వస్తున్నప్పుడు వాటిని సైన్‌ చేయకుండా ప్రేమలో పడ్డానని, పెళ్లి చేసుకుని, సెటిల్‌ అవ్వాలని కలలు కన్నానని...అనుకోని కారణాలతో నా కెరీర్‌ మొత్తం నాశనమైందని ఆమె అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసారు.

ఆ తర్వాత అమెరికాలో కొంతకాలం తల్లిదండ్రుల వద్ద ఉంది. 2007లో ఉజ్వల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఎక్కువ కాలం అతనితో ఉండలేక పోయింది. విడిపోయింది. సినిమాలపై ఫ్యాషన్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటికే ఆర్తి గ్లామర్ తగ్గిపోవడం...ఇతర హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో అమ్మడుకి అవకాశాలు తగ్గాయి.

English summary
AArthi Agarwal a Telgu Film Actress is No More. Her Death because of Health Problem.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu