»   » మై గాడ్..! నిన్నటి సెక్సీ హీరోయిన్ ఇలా.., ధారుణం

మై గాడ్..! నిన్నటి సెక్సీ హీరోయిన్ ఇలా.., ధారుణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దొంగ దొంగ' సినిమా చూసిన వాళ్లెవ్వరూ కూడా అను అగర్వాల్ ను అంత సులువుగా మరిచిపోలేరు. దక్షిణాది ప్రేక్షకుల్ని ఆ ఒక్క సినిమాతోనే ఉర్రూతలూగించేసింది అను. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె పేరెత్తగానే 'ఆషికి' గుర్తుకొస్తుంది. ఆ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. అసలింతకీ అను కి ఏమయ్యిందీ ఎందుకిలా ఆమె మరిపోయిందీ అంటే...

అను అగర్వాల్

అను అగర్వాల్

డస్కీ బ్యూటీ అను అగర్వాల్ ఆషికి సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఓ మధుర జ్నాపకంగా మిగిలిపోయింది. అప్పట్లో కుర్రకారును అను ఒక ఊపు ఊపేసింది. తర్వాతి కాలంలో ఆమె ఒక రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలో దాదాపు నగ్నంగా కూడా కనిపించింది.

అనుకున్నట్టు జరగ లేదు

అనుకున్నట్టు జరగ లేదు

ఐతే అప్పుడంత అందంగా ఉన్న అను అగర్వాల్.. ఇప్పుడెలా తయారైందో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఆషికి సినిమాతో సంచలనం సృష్టించిన తార అను అగర్వాల్. ఆ తర్వాత మణిరత్నం తీసిన దొంగ దొంగలో కూడా తన విశ్వరూపం చూపించింది అను. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అంతా అనుకున్నట్టు జరగ లేదు అను అగర్వాల్ జీవితం మరో మలుపుతీసుకుంది...

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

1999లో ముంబయిలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అను అగర్వాల్.. చాన్నాళ్ల పాటు మృత్యువుతో పోరాడింది. ఎట్టకేలకు కోమా నుంచి బయటకొచ్చింది. ఊడిన కారు చక్రం వల్ల పల్టీలు కొట్టిన కారుతో సహా అనుసరీరం కూడా నుజ్జు నుజ్జు అయ్యింది కానీ ప్రాణం మాత్రం పోలేదు.

తలకు బలమైన గాయాలు

తలకు బలమైన గాయాలు

శరీరంలో చాలా ఎముకలు నుజ్జు, తలకు బలమైన గాయాలు. . వరస పెట్టి శస్త్ర చికిత్సలు, శరీర మంతా కుట్లు. 29 రోజుల కోమా. తిరిగి మెలకువ వచ్చాక తానెవరో తెలీని అయోమయం. హిస్టీరికల్‌ పోస్ట్‌ ట్రామాటిక్‌ అమ్నేసియా, మెమొరీ లాస్‌. మళ్లీ కొత్త జీవితాన్ని చిన్నారిలా ప్రారంభించింది.

మూడున్నరేళ్ల సుదీర్ఘ యాతన

మూడున్నరేళ్ల సుదీర్ఘ యాతన

నిద్ర లేచాక వెలుగుతో పాటు కనిపించే నర్సులు విష్‌ చేసే గుడ్‌ మార్నింగ్‌తో అది పగలు అని కొత్తగా తెలుసుకుంది. బంధువుల్ని గుర్తు పట్టలేకపోయింది. తల్లిదండ్రుల వైపు ప్రశ్నగా చూసింది. మూడున్నరేళ్ల సుదీర్ఘ యాతన తర్వాత కోలుకుంది.అయితే ఆమె లోపల ఉండే పట్టుదల, ఆత్మ విశ్వాసం మాత్రం ఏ గాయాలూ తగలకుండా అలానే ఉన్నాయి

ఎన్నో సర్జరీలు

ఎన్నో సర్జరీలు

ఎట్టకేలకు కోమా నుంచి బయటకొచ్చింది. ఎన్నో సర్జరీల తర్వాత అను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పటి అనుకు, ఇప్పుటి అనుకు అస్సలు పోలికలుండవు. కానీ టాలెంట్ మాత్రం పోదు కదా. అందుకే.. ఆమె జీవిత ఘటనలతోనే ఆటోబయోగ్రఫీని సినిమాగా తెరకెక్కించింది అను అగర్వాల్. ఆ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే నెలలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాహుల్ రాయ్ తో కలిసి

రాహుల్ రాయ్ తో కలిసి

మహేష్ భట్ ప్రొడక్షన్ హౌజ్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ఒక వేడుక చేశారు. ఈ 30 ఏళ్లలో ఆయన ప్రొడక్షన్లో పని చేసిన నటీనటులు.. టెక్నీషియన్లను ఈ వేడుకకు పిలిచారు. అప్పట్లో ‘ఆషికి' సినిమాలో నటించిన హీరో రాహుల్ రాయ్ తో కలిసి అను రాగా.. దీని సీక్వెల్ ‘ఆషికి-2'లో జంటగా కనిపించిన సిద్దార్థ్ రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ కూడా ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఐతే వీరందరిలో చాలా చిత్రంగా.. గుర్తుపట్టలేనట్లుగా కనిపించింది అనునే.

English summary
Aashiqui star Anu Agarwal meets Aashiqui 2’s Shraddha Kapoor as Vishesh Films complete 30 years
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu