»   » అవు-పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి...(మోషన్ పోస్టర్)

అవు-పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి...(మోషన్ పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమా టైటిళ్లు చాలా వెరైటీగా ఉంటున్నాయి. కొన్ని సినిమాలు, కొందరు స్టార్ల పేర్లకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా కూడా టైటిల్స్ పెడుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు పబ్లిసిటీ పెంచడానికే ఇలాంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వెరైటీ టైటిల్ తో సినిమా రాబోతోంది.

'అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పేరుతో ఎస్.జె చైతన్య దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. బాహుబలిలో కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్ లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

సినిమాలో ఏం చూపించబోతున్నారో తెలియదు కానీ.... ఇందులో ప్రభాస్ ను బాగా వాడుకున్నారని మాత్రం స్పష్టమవుతోంది. అసలు అవుకు, పులికి సంబంధం ఏమిటి...మధ్యలో ప్రభాస్ పెళ్లి ఏంటో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు కవి శంకర్ సంగీతం అందిస్తున్నారు.

రెడ్ కార్పెట్ రీల్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గతంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ పెళ్లి శుభలేఖ రిలీజ్ చేసారు. దీన్ని బట్టి ఇందులో ప్రభాకర్.... పోషిస్తున్న పాత్రపేరు ప్రభాస్ అని తెలుస్తోంది. సినిమాకు వెరైటీ టైటిల్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.

English summary
"Aavu Puli Madhyalo Prabhas Pelli" is an upcoming film directed by SJ Chaitanya. Baahubali fame Kalakeya Prabhakar is playing lead role in the movie and the film's motion poster of the film was released today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu