»   » వీడియో : చంపేసింది సమంత.. కెమిస్ట్రీ అదిరిందిగా..!

వీడియో : చంపేసింది సమంత.. కెమిస్ట్రీ అదిరిందిగా..!

Subscribe to Filmibeat Telugu
వీడియో : చంపేసింది సమంత.. కెమిస్ట్రీ అదిరిందిగా..!

ఎప్పటికైనా సమంత సమంతనే. హీరోయిన్లు ఎంత మంది వస్తున్నా తన ప్రత్యేకతని ఈ అక్కినేని కోడలు ఎప్పటికప్పుడు చాటి చెబుతూనే ఉంది. సమంత తన నటనతో అభిమానులని ఆశ్చర్య పరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజగా సమంత పోషిస్తున్న మరో ఛాలెంజింగ్ రోల్ రంగస్థలం చిత్రంలోని రామలక్ష్మి. ఇటీవలే సమంత పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అబ్బుర పరిచింది. రామ లక్మి మాయ నుంచి తేరుకోక ముందే అభిమానులను సమంత మరో మారు సర్ప్రైజ్ చేసింది.

పెళ్ళయాక కూడా

పెళ్ళయాక కూడా

అక్కినేని వారి కోడలు అయ్యాక కూడా ఈ భామ ఇటు తెలుగు అటు తమిళ భాషా చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

విశాల్ తో రొమాన్స్

విశాల్ తో రొమాన్స్

సమంత ప్రస్తుతం తెలుగులో రంగస్థలం చిత్రంతో పాటు, తమిళంలో రూపొందుతున్న విశాల్ అభిమన్యుడు చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగులో కూడా త్వరలో విడుదల కానుంది.

అదిరిపోయిన టీజర్

అదిరిపోయిన టీజర్

ఆ మధ్యన అభిమన్యుడు చిత్ర టీజర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సాంగ్ ప్రోమో విడుదల.. సమంత సెన్సేషన్

తాజాగా ఈ చిత్ర సాంగ్ ప్రోమో మరియు మేకింగ్ వీడియో ని విడులా చేసారు. ఈ ప్రోమోలో సమంత, విశాల్ మధ్య కెమిస్ట్రీ సెన్సేషన్ అని చెప్పొచ్చు. సమంత తన అందమైన హావభావాలు, చిరునవ్వులతో డామినేట్ చేసింది. ఈ వీడియో విడుదలైన కొద్ది సేపటికే వైరల్ గా మారింది.

కెమిస్ట్రీ పీక్స్

కెమిస్ట్రీ పీక్స్

ఈ ప్రోమోని వీక్షించిన అభిమానులంతా సమంత అదుర్స్ అని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలాంటి హవభవాలు తనకు మాత్రమే సాధ్యం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్, సమంత మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. దాదయో రెండు నిమిషాల ఈ వీడియోని చూసినంత సేపు మైమరచిపోయి సమంత మాయలో పడడం ఖాయం.

రామలక్ష్మి మాయ నుంచి బయటకు రాక ముందే

రామలక్ష్మి మాయ నుంచి బయటకు రాక ముందే

రంగస్థలం చిత్రంలో సమంత రామలక్ష్మి పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల టీజర్ విడుదల చేశారు. 80 లలో తగ్గట్లుగా సమంత సమంత పెర్ఫామెన్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉండడంతో టీజర్ సూపర్ హిట్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆ మాయనుంచి బయటకు రాక ముందే అభిమన్యుడి చిత్ర టీం ఈ వీడియో విడుదల చేసారు.

English summary
Abhimanyudu movie song promo released. chemistry between Vishal and Samantha is simply superb.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X