»   » ప్రభుదేవా అదరగొట్టాడు: ‘అభినేత్రి’ అఫీషియల్ టీజర్

ప్రభుదేవా అదరగొట్టాడు: ‘అభినేత్రి’ అఫీషియల్ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎఎల్. విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత సురేష్ బాబు, బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్, తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్, సోనూ సూద్,తమన్నా, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు. ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

తన డాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసిన కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ప్రభుదేవా దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రంలోని ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశారు. ఈ పాటలో ఎమీ జాక్సన్‌ ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది.

టీజర్

ప్రభుదేవా డాన్స్, అమీ జాక్సన్ లపై చిత్రీకరించిన సాంగ్ ను ఈ రోజు టీజర్ రూపంలో రిలీజ్ చేసారు. కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించేలా ప్రభుదేవా ఈ టీజర్లో వేసిన స్టెప్స్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి.

విజయేంద్ర ప్రసాద్

విజయేంద్ర ప్రసాద్

అభినేత్రి పస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కార్యక్రమంలో బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్.

ప్రభుదేవా, తమన్నా

ప్రభుదేవా, తమన్నా

అభినేత్రి పస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ప్రభుదేవా, తమన్నా

ప్రముఖులు

ప్రముఖులు

అభినేత్రి పస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సినీ ప్రముఖులు.

ఫస్ట్ లుక్ పోస్టర్

ఫస్ట్ లుక్ పోస్టర్

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

English summary
Abhinetri Movie Firstlook & Teaser Launch held today (03rd Jenu)eveninng at Dasapalla Hotel in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu