»   » దగ్గుబాటి అభిరామ్ ఫోన్ వారి చేతుల్లో.. పర్సనల్ ఫోటోలు లీక్ చేస్తాం, అంతలోనే ఝలక్!

దగ్గుబాటి అభిరామ్ ఫోన్ వారి చేతుల్లో.. పర్సనల్ ఫోటోలు లీక్ చేస్తాం, అంతలోనే ఝలక్!

Subscribe to Filmibeat Telugu
పధకం ప్రకారమే దగ్గుబాటి అభిరామ్ ఫోన్ చోరీ

శ్రీరెడ్డి వివాదంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అభిరామ్ తో తాను కలసి ఉన్న ఫోటోలని రెడ్డి మీడియాకు లీక్ చేసిన సంగతి తెలిసిందే. అభిరామ్ పేరు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తనని వాడుకుని అభిరామ్ వదిలేసాడని శ్రీరెడ్డి ఆరోపించింది. తాజాగా మరో మారు అభిరామ్ పేరు వార్తల్లో నిలిచింది. అభిరామ్ ఫోన్ ఓ రెస్టారెంట్ లో దొంగిలించబడినట్లు తెలుస్తోంది. ఫోన్ కావాలంటే కోట్లాది రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారట. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

శ్రీరెడ్డి వివాదంలో

శ్రీరెడ్డి వివాదంలో

అవకాశాలు పేరుతో తనని వాడుకుని వదిలేశారని శ్రీరెడ్డి ఆ మధ్యన మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ పేరు ప్రస్తావిస్తూ కొన్ని ఫోటోలు మీడియా ముందు బయటపెట్టిన సంగతి తెలిసిందే.

సెటిల్మెంట్ కుదరదు

సెటిల్మెంట్ కుదరదు


తనని అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని తెలిపిన శ్రీరెడ్డి.. సెటిల్మెంట్ కు కూడా ప్రయత్నించారని కానీ తాను అంగీకరించలేదని తెలిపింది. తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న శ్రీరెడ్డి ఈ విషయంపై పోలీసులని మాత్రం ఆశ్రయించలేదు.

అభిరామ్ ఫోన్ చోరీ

అభిరామ్ ఫోన్ చోరీ

దగ్గుబాటి అభిరామ్ ఫోన్ ఇటీవల ఓ రెస్టారెంట్ లో దొంగిలించబడినట్లు తెలుస్తోంది. ఫోన్ చోరీ చేసిన వారు ఫోన్ చేసి తమకు రూ 1.5 కోట్లు ఇవ్వాలని లేకుంటే ఇందులో ఉన్న పర్సనల్ ఫోటోలు లీక్ చేస్తాం అని బెదిరించారు.

పోలీస్ లకు ఫిర్యాదు

పోలీస్ లకు ఫిర్యాదు

వెంటనే అభిరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ తక్కువ సమయంలోనే నిందితులని అరెస్ట్ చేసారు. వారు లీక్ చేస్తానని బెదిరించిన సమాచారం ఏంటనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

English summary
Abhiram Lost His Phone. Police takes immediate action
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X