Just In
- 14 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
Don't Miss!
- News
రజనీకాంత్ సేన వలసల బాట .. డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతలపై తలైవా టీమ్ చెప్పిందిదే !!
- Automobiles
ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బోయపాటి, నిఖిల్,సుధీర్ బాబు...వీళ్లందరితో ఒకే నిర్మాత 5 సినిమాలు ప్రకటన
హైదరాబాద్: పంపిణీ రంగంలో నెంబర్ వన్ స్దానంలో వెలుగుతున్నారు అభిషేక్ పిక్చర్స్. వరసపెట్టి పెద్ద సినిమాలు...'శ్రీమంతుడు','రుద్రమదేవి', 'నాన్నకు ప్రేమతో', 'సుప్రీమ్', 'కబాలి' వంటి సహా అనేక భారీ చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్ద ఇప్పుడు నిర్మాణ రంగంలోకి వస్తోంది.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా కలిగిన ఆ సంస్థ అధినేత అభిషేక్ నామా ఇప్పుడు నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతున్నామని చెప్తున్నారు. ఐదు సినిమాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ ఐదు చిత్రాల వివరాలు..
ఇక ఈ సినిమాలు కూడా తాము రిలీజ్ చేసి, సక్సెస్ సాధించిన చిత్రాలు లాగే మంచి కథ,కథనంతో రెడీ అవుతున్నాయని చెప్తున్నారు. ఈ సినిమాల్లో హై బడ్జెట్, మీడియా, లో బడ్జెట్ అన్నీ ఉండటం విశేషం. సినిమా పరిశ్రమతో తమకున్న అనుబంధంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నారు.
ఆ సినిమాల డిటేల్స్...

బోయపాటి శ్రీను డైరక్షన్...
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ యాక్షన ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు అభిషేక్. ఇందులో రకుల్ ప్రీతసింగ్ హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ‘సరైనోడు' చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేసిన రిషీ పంజాబీ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.

నిఖిల్ తో ..
సెప్టెంబర్‌లోనే మరో సినిమా కూడా ప్రారంభించనున్నారు అభిషేక్. ‘స్వామి రారా' చిత్రంతో హిట్ కాంబినేషన అనిపించుకొన్న హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మ కలయికలో ఈ సినిమా రూపుదిద్దుకొంటుంది.

‘క్షణం' కాంబినేషన్ లో ...
‘క్షణం' జంట అడవి శేష్, అదా శర్మ కాంబినేషనలో ‘క్షణం' దర్శకుడు రవికాంత పేరేపు దర్శకత్వంలో నిర్మించే చిత్రం షూటింగ్ ఆగస్టు నెలాఖరున ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ‘గూఢచారి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

బయోపిక్
ప్రముఖ బ్యాడ్మింటన క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా నిర్మించే చిత్రంలో సుధీర్‌బాబు హీరోగా నటించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన వర్క్ పూర్తయింది.

హంటర్ రీమేక్
ఫాంటమ్- రిలయన్స సంస్థలతో కలసి అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. హిందీలో రూపుదిద్దుకొన్న ‘హంటర్' చిత్రానికి రీమేక్ ఇది. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్, ‘లండన డ్రీమ్స్' దర్శకుడు నవీన మేడారం దర్శకుడు, శ్రీనివాస్ అవసరాల హీరో.

మామూలు విషయంకాదు...
ఇలా ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్ చేయడమంటే అది మామూలు విషయమే కాదు.. దీనిపై వివరణ ఇస్తూ ‘ఈ ఐదు చిత్రాల నిర్మాణం అనుకొన్న విధంగా సాగేట్లు పకడ్బందీగా ప్లాన చేశాం' అని అభిషేక్ నామా చెప్పారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కాలి సుధీర్ వ్యవహరిస్తారు.