twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న రాత్రి అక్కడే.... హరికృష్ణకు ఆ హోటల్ రూముకు లింకేంటి? ముందే కీడు శంకించారా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Nandamuri Harikrishna Knows About The Incident In Prior ??

    నందమూరి హరికృష్ణ మరణం తర్వాత అబిడ్స్‌లోని 'ఆహ్వానం' హాటల్ చర్చనీయాంశం అయింది. ఇక్కడ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకు కారణం... ఈ హోటల్‌లోని రూమ్ నెం. 1001లో హరికృష్ణ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వెళ్లి 10 గంటల వరకు అక్కడ గడపటం, మళ్లీ భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు గడపటం ఆయనకు అలవాటు. ఈ హోటల్ కట్టినప్పటి నుండి 1001 రూమును తన సొంతంగా ఉంచుకున్నారు. ఇక్కడే రోజులో ఎక్కువ సమయం గడపటానికి ఆయన ఆసక్తి చూపేవారు.

    నిన్న రాత్రి అక్కడే...

    నిన్న రాత్రి అక్కడే...

    నిన్న కూడా ఉదయం 6 గంటలకు ఈ హోటల్ కు వచ్చారు. సాయంత్ర 5 గంటలకు వరకు గడిపారు. రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత తనకు ఎంతో ప్రీతిపాత్రమైన 1001 రూములోనే నిద్రించారు. ఈశాన్య మూల, తూర్పు ముఖంతో ఉండటం వల్ల ఇది తనకు ఎంతో కలిసొచ్చిందని హరికృష్ణ విశ్వసించేవారట. దీనికి వాస్తు పరంగా కూడా కొన్ని మార్పులు చేయించారు.

    అదే ఆఖరి మాట

    అదే ఆఖరి మాట

    హోటల్‌లో ఆయనకు సన్నిహితంగా ఉండే సిబ్బంది ఒకరు మాట్లాడుతూ నిన్న హరికృష్ణగారు రూముకు వచ్చారు. ఫ్రెండ్ కొడుకు మ్యారేజి ఉంది వెళుతున్నాను అన్నారు. రేపు వస్తానో రానో అని చెప్పి తలుపేసుకున్నారు. రాత్రి 1 గంటకు నిదలేపమని చెప్పారు. ఆయన్ను నిద్రలేపడానికి రిసెప్షన్ నుండి ఫోన్ చేయించాం. ఆయన లేచి రెడీ అవుతున్నానమ్మా అన్నారు. అదే ఆఖరి మాట అని తెలిపారు.

    అందుకే డ్రైవర్ లేడు

    అందుకే డ్రైవర్ లేడు

    ఉదయం టీవీలో ఆయన మరణవార్త విని షాకయ్యాం. ఆయనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. చాలా స్మూత్ గా డ్రైవ్ చేస్తారు. అక్కడ అంత వేగంగా ఎందుకు వెళ్లారో తెలియదు. ఆయనకు టైమ్ బాగోలేదని సిద్ధాంతి గారు చెప్పారట. కొంతకాలం వరకు డ్రైవర్ ఎవరినీ పెట్టకోవద్దని చెప్పడం వల్లనే ఆయనే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారని హోటల్ సిబ్బంది తెలిపారు.

    జానకిరామ్ మరణం తర్వాత

    జానకిరామ్ మరణం తర్వాత

    జానకిరామ్ మరణానికి ముందు ఆయనకు సిద్ధాంతి ఒకరు కార్లో కుడి వైపు కూర్చోవద్దు. డ్రైవింగ్ మానేయ్ అని చెప్పారట. కానీ ఆయన పట్టించుకోకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంతో యాక్సిడెంటుకు గురై మరణించారు. అప్పటి నుండి హరికృష్ణ సిద్ధాంతిగారు చెప్పింది బాగా నమ్మేవారు.

     ఈ రెండు నెలలు టైమ్ బాగోలేదని చెప్పారు

    ఈ రెండు నెలలు టైమ్ బాగోలేదని చెప్పారు

    ఆగస్టు, సెప్టెంబర్ తనకు టైమ్ బాగోలేదు... అక్టోబర్ వరకు డ్రైవర్‌ను పెట్టుకోకండా ఆగమని సిద్ధాంతి గారు చెప్పారట. దీంతో నలుగురు డ్రైవర్లు వస్తే వారిని చార్జీలు ఇచ్చి వెనక్కి పంపించారు. సిద్ధాంతిగారు అలా చెప్పినప్పటి నుండి ఏదో జరుగబోతోంది అని కాస్త ఆందోళనగా కనిపించేవారు. డ్రైవర్‌ను పెట్టుకుంటే ఏమైనా అవుతుందేమో అనే కీడు శంకించేవారు అని హోటల్ సిబ్బంది ఒకరు వెల్లడించారు.

    స్నేహితులంటే విలువిస్తారు

    స్నేహితులంటే విలువిస్తారు

    ఈ మధ్య కాలంలో ఆయన ఇక్కడ పార్టీ వారిని కలవడానికి ఇష్టపడటం లేదు. ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలో ఉండేవారు. పిల్లలు ఉన్నారు అన్నీ చూసుకుంటారు. నాన్నగారు ఇచ్చింది ఉంది. ఎవరికీ అన్యాయం చేయకూడదు, ఎవరూ మన వల్ల నష్టపోకూడదు అని ఆలోచించే వ్యక్తి. స్నేహితులకు చాలా విలువ ఇస్తారు. చుట్టాల పెళ్లికి కూడా వెళ్లేవారు కాదు. ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఉండటంతో నిన్న బయల్దేరి వెళ్లారని సిబ్బంది గుర్తు చేసుకున్నారు.

    English summary
    Abids Aahwanam Hotel Staff Speaks About Nandamuri Harikrishna. Nandamuri Harikrishna, actor and politician, passed away on Wednesday morning in a tragic car accident. The accident happened on the Annaparthi road near Narketpally in Telangana's Nalgonda district. He was 61.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X