»   »  ‘1 నేనొక్కిడినే ’ హీరోయిన్ కి ఆఫర్ ఎలా వచ్చింది?

‘1 నేనొక్కిడినే ’ హీరోయిన్ కి ఆఫర్ ఎలా వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు అందరీ దృష్టీ మహేష్ బాబు తాజా చిత్రం '1 నేనొక్కిడినే ' పైనే. సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి చాలా మంది పెద్ద నిర్మాతలు, దర్శకులు ఆరా తీస్తున్నారు. హీరోలు సైతం ఈ చిత్రం రిలీజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆమె సక్సెస్ అయితే తమ సినిమాల్లో వెంటనే బుక్ చేసుకోవచ్చుననే ఆలోచన. ఇంతకీ ఈ కృతి సనోన్ ఎవరు...అంటే..

ఈ ముంబై ముద్దుగుమ్మ మొదట ఇంజినీర్‌ కావాలనుకుంది. కాలేజీకెళ్లే టైమ్‌లో నే కొన్ని టీవీ ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత మోడలింగ్‌ ని ప్రెఫెషన్ గా తీసుకుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు రావటం మొదలెట్టింది. ఈ లోగా ఆమె ఊహించని విధంగా ఫేమస్‌ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ దృష్టిలో పడింది. ఓ పెద్ద ఫోటోషూట్‌. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. కృతి పేరు ముంబై ఫిలింసర్కిల్స్‌లో మార్మోగిపోయింది. దాంతో వరుసగా బాలీవుడ్‌లో పిలుపులు వచ్చాయి. ఓ సినిమాకి కూడా కమిట్‌ అయ్యింది. అయితే అది అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నిరాసలో ఉంది.

About '1 Nenokkadine' Heroien Kriti Sanon

సరిగ్గా అదే సమయంలో మహేష్‌ సినిమా కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని వింది. అంతే వెంటనే హైదరాబాద్‌ వచ్చింది. ఆడిషన్స్‌లో దర్శకనిర్మాతల్ని, హీరోని మెప్పించింది. ఇంకేముంది. '1 నేనొక్కిడినే ' హీరోయిన్ గా ఫిక్సయిపోయింది. తెలుగు పరిశ్రమలోనే మెగాబడ్జెట్‌ సినిమాలో నటిస్తూ హాట్‌ టాపిక్‌ అయిపోయింది.

అక్కడ నుంచి 2014 మోస్ట్‌ ఎవైటింగ్‌ హీరోయిన్ గా అందరి కళ్లలో పడింది. మొదటి సినిమా చాలా ముఖ్యం. అందుకే ఎంతో జాగ్రత్త తీసుకుని నటించాను. మహేష్‌ డౌన్‌ టుఎర్త్‌. కొన్ని సన్నివేశాల్లో చాలా సహకరించారు.. అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. వన్‌ ప్రచార చిత్రాల్లో బాగానే కనిపించింది. సినిమా రిలీజైతే కానీ ఫేట్‌ ఏమిటో తేలదు. అందుకోసమే ఆమె చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తోంది. బెస్టాఫ్ లక్...కృతీ.

సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary

 Kriti Sanon is an Indian model, actress, and an accomplished Kathak dancer. In January 2014, she is making her debut opposite Mahesh Babu in highly anticipated Telugu movie One. She has modeled for Ritu Beri, Suneet Varma and Niki Mahajan. She then appeared in television commercials, endorsing brands like Close Up, Vivel, Amul, Samsung and Himalaya. She modeled for Wills Lifestyle India Fashion Week 2010, held in Mumbai. In 2012, she appeared in Chennai International Fashion week and India International Jewelry week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu