For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ఫ్యామిలీ వదిలేటట్లు లేరుగా, అల్లు అర్జున్ కూడా...

  By Srikanya
  |

  హైదరాబాద్: వరుణ్ తేజ తో ముకుందా చిత్రంలో హీరోయిన్ గా కనిపించిన పూజ హేడ్గే గుర్తుందా. ఆ తర్వాత ఆమె నాగచైతన్య సరసన ఒక లైలా కోసం లోనూ చేసింది. కానీ ఆ తర్వాత ఇక్కడ ఊహించినంతగా క్రేజ్ రాకపోవటంతో బాలీవుడ్ కు తరలి వెళ్లిపోయింది. అక్కడ హృతిక్ రోషన్ తో మొహంజదారో చిత్రం చేస్తూ బిజీగా ఉంది.

  అయితే మళ్లీ ఆమె తెలుగు తెరపై కన్నేసింది. ఇక్కడ అల్లు అర్జున్ సరసన చేయటానికి సైన్ చేసిందని సినీ వర్గాల సమాచారం. హరీష్ శంకర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆమెను ఎప్రోచ్ అయినట్లు చెప్తున్నారు.

  బాగా చదువుకొని... మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. అమ్మానాన్నలకు పేరు తీసుకురావాలి. ఇలానే కలలు కన్నదామె. ఆ దిశగా అడుగులేస్తున్న సమయంలో అనుకోకుండా పాల్గొన్న అందాల పోటీలు జీవితాన్నే మార్చేశాయి. ఆమె ప్రతిభను ప్రదర్శించే వేదికలయ్యాయి. విజేతలుగా నిలబెట్టకపోయినా వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టాయి.

  అసలు పూజా హెగ్డే ఆలోచనలేంటి...ఆమె గోల్స్ ఏంటి అనే విషయాలు స్లైడ్ షోలో చూడండి.

  భయం..ఆశ్యయ్య

  భయం..ఆశ్యయ్య

  వేదిక మీదకు వెళ్లాలంటే భయం. ఒకవేళ వెళ్లినా... నేను చెప్పాలనుకున్నదీ, చేయాలనుకున్నదీ కంగారులో మర్చిపోయి సిగ్గుతో కిందకు వచ్చేదాన్ని. అలాంటి నేను వెండి తెర మీద కనిపిస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.

   బాధించేది

  బాధించేది

  అమ్మానాన్నలు చిన్నతనంలోనే భరత నాట్యం నేర్పించారు. కానీ కుటుంబ సభ్యుల ముందు తప్ప ఎక్కడా నృత్యం చేసేదాన్ని కాదు. కారణం బిడియం. వేదిక మీదకు వెళ్లినా భంగిమలు మర్చిపోయి సిగ్గుతో వెనుదిరిగేదాన్ని. పాటలు కూడా బాగా పాడేదాన్ని. అందరి ముందూ ప్రతిభను ప్రదర్శించాలనున్నా సభాపిరికి కారణంగా ఆత్మన్యూనత బాధించేది.

  అలా అథిగమించా

  అలా అథిగమించా

  ఆ లోపాలన్నింటినీ అధిగమించేందుకు కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా పేరు ఇవ్వడం... అందులో పాల్గొనడం మొదలుపెట్టా. బీకామ్‌ చదువుతున్నప్పుడు మా కళాశాలలో మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఆడిషన్లు జరిగాయి. పోటీ అనగానే ఆలోచించకుండా గుడ్డిగా పేరిచ్చేశా.

  నా నేటివ్...నా కుటుంబం

  నా నేటివ్...నా కుటుంబం

  నా స్వస్థలం ఉడిపి. కానీ మా కుటుంబం ముంబయిలో స్థిరపడింది. నాన్న న్యాయవాది. అమ్మ వ్యాపారవేత్త. అన్నయ్య డాక్టర్‌. నేను తప్ప అందరూ ఉన్నత విద్యావంతులే. నేను కూడా వాళ్లలా చదువుకుని గొప్పగా స్థిరపడాలనుకున్నా. చదువు తప్ప వేరే వ్యాపకమేమీ ఉండేది కాదు.

  నమ్ముతారా

  నమ్ముతారా

  అప్పటివరకూ నేను హైహీల్స్‌ వేసుకోలేదంటే నమ్ముతారా? మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2010 పోటీల కోసం ఆరున్నర అంగుళాల ఎత్తు మడమల చెప్పులు వేసుకుని నడుస్తుంటే చుక్కలు కనిపించాయి. నేను అందంగా కనిపించడానికి కాకుండా.. హీల్స్‌ వేసుకొని నడవడానికే ఎక్కువ సాధన చేశా.

  మొదట ఓ తమిళ సినిమాలో చేసా...

  మొదట ఓ తమిళ సినిమాలో చేసా...

  ఎలాగైతేనేం మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2010 రెండో రన్నరప్‌గా నిలిచా. దాంతోపాటూ 'మిస్‌ ఇండియా గ్లామరస్‌ హెయిర్‌' టైటిల్‌నీ సొంతం చేసుకున్నా. ఆ తరవాత సినిమా అవకాశాలు వచ్చాయి. అమ్మానాన్నలూ చేయమని ప్రోత్సహించారు. అలా మొదట తమిళ సినిమాలో నటించా.

  నాగార్జున గారు వెన్ను తట్టారు

  నాగార్జున గారు వెన్ను తట్టారు

  అది చూసి 'ఒక లైలా కోసం' ఆడిషన్లకు రమ్మని ఆహ్వానించారు. నాగార్జున గారిని కలవడం అదే మొదటిసారి. బాగా చేయమని వెన్నుతట్టారు. ఇప్పుడనిపిస్తోంది నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని.

  తెలుగు నేర్చుకున్నా

  తెలుగు నేర్చుకున్నా

  మొదట్లో నటన మీదకంటే భాషపైనే ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని. సంభాషణలు చెబుతూ హావభావాల గురించి పట్టించుకునేదాన్ని కాదు. దాంతో టేకులు ఎక్కువ తీసుకునేదాన్ని. కొన్నిరోజులయ్యాక అలా చేయడం సరికాదని చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నా.

  హైదరాబాద్ తో అనుబంధం

  హైదరాబాద్ తో అనుబంధం

  అలానే హైదరాబాద్‌తోనూ అనుబంధం పెరిగింది. గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్‌ సిటీ బాగా నచ్చాయి. ఇక్కడ బిర్యానీకి ఫిదా అయ్యా. రంజాన్‌ నెలలో వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్లకి హలీం తీసుకెళ్లేదాన్ని. పూతరేకులన్నా మనసు పారేసుకుంటా. హైదరాబాద్‌ బయల్దేరుతున్నానంటే చాలు మా ఇంట్లో వాళ్లు 'అవి తీసుకురా.. ఇవి తీసుకురా' అని జాబితా రాసిస్తున్నారు.

  ప్రస్తుతం...

  ప్రస్తుతం...

  తెలుగులో 'ముకుంద'లో, హిందీలో హృతిక్‌రోషన్‌తో మొహంజెదారో'లో నటిస్తున్నా.

  English summary
  Pooja Hedge happy with her latest Oka Laila Kosam Hit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X