ప్రియమణి 'చారులత' స్టోరీ లైన్ ఏంటి?
అవిభక్త కవలలుగా ప్రియమణి నటన అందర్నీ ఆకట్టుకొంటుంది. ఉత్కంఠ కలిగించేలా ఉంటుందీ హారర్ చిత్రం. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని''అని నిర్మాత చెప్తున్ననారు. 'చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర చేస్తున్నారు. థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి సినిమా మొత్తం చారు, లత అతుక్కునే ఉంటారా లేక శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారా? అనేది ప్రస్తుతానికి సీక్రెట్. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు.
ఒక సన్నివేశంలో దుడుకుగా, ఆ వెంటనే అమాయకంగా నటించడం అంత సులువు కాదని, దర్శకుడి సహకారంతో చేస్తున్నానని ప్రియమణి పేర్కొన్నారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'కి ఉత్తమ నటిగా ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్నారు. 'చారులత' మరో జాతీయ అవార్డు తెచ్చిపెట్టడం ఖాయం అని కన్నడరంగం వారు అంటున్నారు. ఈ చిత్రంలో సీత, శరణ్య, ఆర్తి తదితరులు నటిస్తున్నారు. గీతా ఫిలిమ్స్ ద్వారా ఈ సినిమా విడుదలవుతుంది. ఛాయాగ్రహణం: ఎన్.వి.పన్నీర్ సెల్వం, సంగీతం: సుందర్ సి.బాబు.


Click it and Unblock the Notifications












