ముస్లింలకు నచ్చేలా స్టార్ హీరో కథలో మార్పులు

By Srikanya

చెన్నై : 'తుపాకి ' విడుదల అయినప్పుడు అందులో సన్నివేశాలపై విజయ్‌పై ముస్లీంవర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అందులో సన్నివేశాలు తొలిగించాలని ధర్నాలు చేసాయి. చివరకు రాజీ కొచ్చి,కొన్ని సీన్స్ తీసేసారు. ఈ నేఫధ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు విజయ్ తాజా చిత్రం 'తలైవా'లో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ముస్లీం సోదరులతో కలసి ప్రజలకు సేవ చేసేలా కథ అల్లినట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని ఆగస్టు 9న రంజాన్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్లు సంబంధితవర్గాలు ప్రకటించాయి. 'నన్బన్‌', 'తుప్పాక్కి' తర్వాత విజయ్‌ నటిస్తున్న చిత్రం 'తలైవా'. ఏఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమలాపాల్‌ హీరోయిన్ . ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. విజయ్‌ పాడిన 'వాంగనా.. వనక్కంగన్నా.. ఎన్‌ పాట్టును కేలుంగన్నా..' గీతం అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.

నిర్మాత ఎస్.చంద్రప్రకాష్ జైన్ మాట్లాడుతూ....నటుడు విజయ్ సహకారం మరువలేనిదన్నారు. తాను ఇంతకుముందు కొన్ని హిట్ చిత్రాలను నిర్మించానన్నారు. కొంత విరా మం తీసుకుని నిర్మించిన చిత్రం తలైవా అని పేర్కొన్నారు. మళ్లీ చిత్రాన్ని నిర్మించాలని భావించినప్పుడు విజయ్‌ను కాల్‌షీట్స్ అడిగానన్నారు. ఆయనతో చిత్రాలు నిర్మించడానికి ఎందరో ప్రముఖ నిర్మాతలు క్యూలో ఉండగా తనకు కాల్‌షీట్స్ ఇస్తారని ఊహించలేదన్నారు. విజయ్ నుంచి ఏమి సమాధానం వస్తుందోనన్న సంకోచంతోనే వెళ్లి కలిశానన్నారు. తదుపరి చిత్రం మీదే చేస్తున్నానని ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయూనన్నారు. చిత్ర షూటింగ్ సిడ్నీలో నిర్వహించినప్పుడు విజయ్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

విజయ్ మాట్లాడుతూ తలైవా చిత్రాన్ని తాను చూశానని, చాలా బాగా వచ్చిందని, తన అభిమానులకు నచ్చుతుందని తెలిపారు. ముంబాయిలోని తమిళ ప్రజల నేపథ్యంతో సినిమాను రూపొందించారు. అక్కడే ఎక్కువభాగం తెరకెక్కించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఘన విజయం సాధిస్తుందని దర్శకుడు విజయ్ ధీమాగా చెప్తున్నారు. ఆయన డైరక్ట్ చేసిన చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ అయిన నేపద్యంలో ఈ చిత్రం ఎలా ఉండనుందనే విషయమై ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తలైవా చిత్రంలో సత్యరాజ్‌, రాగిణి నంద్వాని, రాజీవ్‌ పిళ్లయ్‌, అభిమాన్యుసింగ్‌, సురేష్‌ ముఖ్యపాత్రధారులు. సినిమా తమిళనాడు హక్కులను వేందర్‌ మూవీస్‌ సొంతం చేసుకుంది. మిగిలిన ప్రాంతాల్లో అయ్యంకరన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ విడుదల చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X