»   »  మోనికాకు 'ప్రియుడు' లీగల్ నోటీస్!!

మోనికాకు 'ప్రియుడు' లీగల్ నోటీస్!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Monica Bedi
మోనికాబేడీ తనకూ అబు సలీమ్ కి పెద్ద రిలేషన్ లేదంటూ హాట్ హాట్ గా మీడియాలో ఇస్తున్న స్టేట్ మెంట్స్ ఆమె ప్రియుడు గ్యాంగస్టర్ అబూసలీమ్ కి ఎక్కడో కాలుస్తున్నట్లున్నాయి. అతను జైలు నుండే ఆమెకు నిన్న(మంగళవారం) ఓ లీగల్ నోటీస్ పంపాడు. అతని లాయర్ రాజ్ ఠాకూర్ ఈ నోటీస్ ని అబూ పేరున ఆమెకు ఇష్యూ చేసాడు.

ఇంతకీ లీగల్ నోటీస్ పంపేంత మ్యాటర్ ఏముందంటే..మోనికాబేడీ ఈ మధ్య బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత తాను అబూ తనకు చాలా కాలంగా తెలుసన్న మాట నిజమేనని అయితే పెళ్ళి కాలేదంటూ అందరితో చెబుతోంది. మీడియాలో స్టేట్ మెంట్స్ ఇస్తోంది. దానికి సమాధానంగా అబూ ఈ లీగల్ నోటీస్ లో తనకీ,మోనికాకు నవంబర్ 2000 లో లాస్ ఏంజిల్స్ లో ఉన్న మసీద్ లో మ్యారేజ్ జరిగిందని గుర్తు తెచ్చుకోమని అన్నాడు.

అలాగే ఆ లీగల్ నోటీస్ ఓ ప్రమలేఖ మాదరిగా ఉందని చెప్తున్నారు. అందులో నీకు ఆత్మ సాక్షిగా నా మీద మనసు విరిగిపోతే తలాఖ్ చెప్పుతా అంటున్నాడు. నిజంగా నీకు డైవర్స్ తీసుకోవలనే కోరిక లేకపోతే ఇప్పటికీ నా క్లయింట్ (అబూ సలీం)ను ప్రేమిస్తే మీడియా ని పిలిచి ఆ విషయాన్ని క్లారిఫై చేయి మీకు పెళ్ళయిందనే సంగతి చెప్పు. దాంతో నా క్లయింట్ ప్రశాంతంగా ఈ కాంట్రావర్శీని మర్చిపోయి డిఫెన్స్ పై కాన్సర్టేట్ చేస్తాడు అని నోటీస్ లో ఉద్గాటించారు. ఇక ఇదే విషయాన్ని సలీం చెబుతూ నేనెప్పుడూ ఆమె ఏక్టింగ్ కెరీర్ ని ఆపమని చెప్పలేదు.

అంతేకాదు...తను ఇప్పటికీ జైల్లో ఒంటిరితనాన్ని తప్పించుకోవటానికి ఆమె రాసిన ప్రేమ లేఖలు చదువుకుంటానని, ఆ రోజులు గుర్తు చేసుకుంటానని అందుకే ప్రతీ మ్యారేజ్ ఏనవర్శరీకి ఆమెకు విషెష్ పంపుతూనే ఉన్నానని చెప్తున్నాడు. ఇక నిజంగా ఆమె తనని వదిలించుకోవాలని చూస్తే విడాకులు ఇవ్వటానికి భాధగా అయినా రెడీగా ఉన్నానని చెప్తున్నాడు.దీనిపై మోనికా ఏ కామెంటూ చేయటం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X