twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya: మగధీర కథ చిరంజీవే వింటే అపార్థం చేసుకున్నా.. అందుకే RRR తర్వాత సైలెంట్.. రాజమౌళి కామెంట్స్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. అంతేకాదు, అందులో చాలా మంది టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతూ ఉండడమే అని చెప్పుకోవచ్చు. అలాంటి బడా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు రాబోతున్న మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ మూవీ రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇక, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

     ఆచార్య, సిద్ధ కలిసి వస్తున్నారుగా

    ఆచార్య, సిద్ధ కలిసి వస్తున్నారుగా

    మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రమే 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

    <strong>హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!</strong><br />హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

     ఆచార్య మూవీ స్టోరీ లైన్ ఇదేనట

    ఆచార్య మూవీ స్టోరీ లైన్ ఇదేనట


    కొరటాల శివ తెరకెక్కించే సినిమాలు అంటేనే సందేశాత్మకంగా తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ తీశారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని పూర్తి చేస్తాడని తెలిసింది.

    రిలీజ్‌కు రెడీ.. ప్రీరిలీజ్ ఈవెంట్

    రిలీజ్‌కు రెడీ.. ప్రీరిలీజ్ ఈవెంట్


    'ఆచార్య' మూవీని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆచార్య సందడి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

    <strong>హాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులు</strong><br />హాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులు

    గెస్టుగా జక్కన్న... చిరు సత్కారం

    గెస్టుగా జక్కన్న... చిరు సత్కారం


    'ఆచార్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. దీనికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇటీవలే RRR మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచేసిన ఆయనకు ఈ వేడుక ముగిసే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సత్కారం చేశారు.

    అందుకే సైలెంట్‌గా ఉంటానని

    అందుకే సైలెంట్‌గా ఉంటానని

    'ఆచార్య' ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. 'ఇంతపెద్ద సక్సెస్ వచ్చిన తరువాత ఇంత హంబుల్‌గా ఉంటారని చాలా మంది అడుగుతారు. ఆకాశం అంత ఎత్తు ఎదిగిన చిరంజీవి గారు.. అంత హంబుల్‌గా ఉంటే.. మనకి వచ్చిన సక్సెస్‌లు ఎంత? మనం ఎంత తక్కువలో ఉండాలో ఆయన్ని చూస్తే తెలుస్తుంది. చిరంజీవి గారు మనకి ఎన్నో నేర్పించారు' అని చెప్పుకొచ్చారు.

    నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!

    చరణ్‌ను కూడా డామినేట్ చేస్తూ

    చరణ్‌ను కూడా డామినేట్ చేస్తూ


    ఈ ఈవెంట్‌లో రాజమౌళి.. చిరంజీవి గురించి చెబుతూ 'చిరంజీవి గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. స్క్రీన్‌పై పక్కన ఆయన కొడుకు ఉన్నాసరే నేనే డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఆ లక్షణం చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ఒక ఫ్యాన్‌గా చిరంజీవిగారే బాగున్నారని అనిపిస్తుంది. కానీ డైరెక్టర్‌గా మాకు మా హీరోనే బెటర్‌గా అనిపిస్తారు' అని ప్రశంసలు అందించారు.

     మగధీర కథ చిరంజీవి వినగానే

    మగధీర కథ చిరంజీవి వినగానే


    చరణ్ గురించి రాజమౌళి వివరిస్తూ.. 'మగధీర కథ చిరంజీవి గారు విన్నారు. చరణ్ విషయాలన్నీ ఆయన చూసుకుంటారేమో అని అపార్థం చేసుకున్నా. కానీ చిరంజీవి గారు చరణ్‌కి ఎలాంటి సలహాలు ఇవ్వరు. ఇలా చేయి.. ఇలా చేయొద్దు అని చెప్పరు. యాక్షన్ బాగుంది.. బాగోలేదని కూడా అనరు. ప్రతి నిర్ణయం చరణ్‌దే. తాను తప్పులు చేస్తే తిరిగి తానే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్‌లు చెప్పింది విని తనకి తానుగా నేర్చుకున్నారు. ఆయన మెగాస్టార్ కొడుకు అయ్యి ఉండొచ్చు గానీ.. తనకి తానుగానే ఎదిగాడు. చిరంజీవి గారంత ఎదుగుతాడు' అని అభిప్రాయపడ్డారు.

    Kajal Aggarwal: తల్లైన వెంటనే అలాంటి ఫొటో వదిలిన కాజల్.. డెలివరీ టైమ్‌లో ప్రమాదాన్ని వివరిస్తూ!Kajal Aggarwal: తల్లైన వెంటనే అలాంటి ఫొటో వదిలిన కాజల్.. డెలివరీ టైమ్‌లో ప్రమాదాన్ని వివరిస్తూ!

    ఆయనలో మాంచి మాస్ ఉంది

    ఆయనలో మాంచి మాస్ ఉంది


    ఇక, ఈ వేడుకలో కొరటాల శివ గురించి మాట్లాడుతూ.. 'శివ గారు సైలెంట్‌గా ఉంటారు కానీ చాలా అబ్జర్వ్ చేస్తారు. ఆయన మిర్చి తీసినప్పుడు మంచి మాస్ డైరెక్టర్ వచ్చాడని అనుకున్నాం. కానీ తర్వాత ఆయన పంథాను మార్చారు. ఆచార్య సినిమాలో అసలు సిసలు మాస్ ఎలిమెంట్స్ చూస్తారు. నాకు తెలుసు.. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది' అని జక్కన్న చెప్పారు.

    English summary
    Chiranjeevi, Ram Charan Did Acharya movie Under Koratala Siva Direction. Now This Movie Censor and Run Time Details Out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X