For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాద్‌షా' లో ఎన్టీఆర్‌ యాక్షన్ ప్యాకెడ్ డైలాగ్స్ ఇవే..

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. రీసెంట్ గా ఆడియో విడుదలైన ఈ చిత్రంలో డైలాగులు చాలా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా విడుదల చేసిన టీజర్ లోని ఈ డైలాగులు కేక పుట్టిస్తున్నాయి. అవి...

  * 'బాద్‌షా' డిసైడ్ అయితే ....వార్ వన్ సైడ్ అవ్వుద్ది

  *శతృవుని కొట్టాలంటే కసి ఉంటే సరిపోదు..కంటెంట్ ఉండాలి

  *భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా

  *బాద్షా ని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది

  * బ్రతకాలంటే బాద్షా క్రింద ఉండాలి, చావాలంటే బాద్షా ముందు ఉండాలి

  *ఇచ్చిన మాట, చెప్పిన డేట్, వేసిన అడుగు వెనక్కి తీసుకోవటం బాద్షా కి తెలియదు..

  హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' లో ఈ మ్యాజిక్ జరుగుతుందంటున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . బండ్ల గణేష్ నిర్మాత.

  ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. బ్యాంకాక్‌లో, హైదరాబాద్‌, గుజరాత్, యూరప్, హాంకాంగ్‌లలో నిరవధికంగా షూటింగ్ జరిపాం. ఇప్పటికే విడుదల చేసిన పాటలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ తోపాటు ఎమ్మెస్‌ నారాయణ, వెన్నెల కిషోర్‌ తదితరులపై చిత్రీకరించిన వినోద ప్రధానమైన సన్నివేశాలు సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.

  ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు'' అని తెలిపారు. ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

  English summary
  The new promos of NTR-starrer Baadshah have become the talk of the tinsel town. The makers have released a couple of new trailers on the occasion of the film's audio and have been getting rave response from all corners. NTR's power-packed dialogues in particular have been the highlight of the promos. Director Sreenu Vaitla and writer-duo Kona Venkat and Gopi Mohan are being showered with praises for penning influential dialogues and let's get a sneak-peak of a few interesting one-liners.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X