»   » హీరో బాలాదిత్య ఓ ఇంటివాడయ్యాడు (వెడ్డింగ్ రిప్షన్ ఫోటోస్)

హీరో బాలాదిత్య ఓ ఇంటివాడయ్యాడు (వెడ్డింగ్ రిప్షన్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలాదిత్య తెలుగు వారికి పరిచయం అక్కర్లేని నటుడు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి... చంటిగాడు సినిమాతో హీరోగా మారిన ఆయన తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. ఆగస్ట్ 6న వైజాగ్‌లో మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం జరిగింది.

ఆగస్టు 12న హైదరాబాద్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో సినీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

బాల నటుడిగా పలువురు స్టార్ హీరోల సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న బాలాదిత్య హీరోగా చంటిగాడు, రూమ్ మేట్స్, 1940లో ఒక గ్రామం, సుందరానికి తొందరెక్కువ లాంటి చిత్రాల్లో బాలాదిత్య నటించారు. అయితే హీరోగా రంగప్రవేశం చేసిన బాలాదిత్య ఆశించిన మేర సక్సెస్ అందుకోలేకపోయాడు.

ప్రస్తుతం బాలాదిత్య ఓ టీవీ క్విజ్ షోకి యాంకర్‌గా చేస్తున్నారు. దీంతో పాటు డబ్బింగ్ కళాకారుడు, వ్యాఖ్యాత, గేయ రచయితగా కూడా అవకాశాల అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. స్లైడ్ షోలో బాలాదిత్య వివాహానికి సంబంధించిన ఫోటోస్..

వివాహం

వివాహం

ఆగస్ట్ 6న వైజాగ్‌లో మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం జరిగింది.

రిసెప్షన్

రిసెప్షన్

ఆగస్టు 12న హైదరాబాద్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో సినీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది

సినిమా స్టైల్

సినిమా స్టైల్

బాలాదిత్య సినిమా స్టైల్ లోనే తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ ని ముద్రించుకోవడం విశేషం

ప్రముఖులు

ప్రముఖులు

ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Actor Baladitya ties the knot with Manasa in a star-studded ceremony in Vijag. The Wedding Reception held at Hyderabad on August 12, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu