»   » ర‌క్తం చిత్రానికి అంత‌ర్జాతీయ అవార్డు.. ఆనందంలో న‌టుడు బెన‌ర్జీ

ర‌క్తం చిత్రానికి అంత‌ర్జాతీయ అవార్డు.. ఆనందంలో న‌టుడు బెన‌ర్జీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేద‌రింగ్ ఫారిన్ డ్రామా ఫీచ‌ర్స్ సెగ్మెంట్ లో (2017) రక్తం చిత్రానికి అవార్డు రావడంపై సీనియర నటుడు బెన‌ర్జీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజేష్ ట‌చ్‌రివ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ర‌క్తం' చిత్రం తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన చిత్రం విడుదలకు ముందే విమర్శకుల ప్రశంసలందుకొంటున్నది.

అవార్డు లభించిన సందర్భంగా నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. నా 36 ఏళ్ల సినిమా కెరీర్‌లో జీవితాంతం గుర్తుండిపోయే ఓ మ‌ధుర ఘ‌ట్టం ఇది. ఇలాంటి అరుదైన అవ‌కాశం ద‌క్కినందుకు చాలా సంతృప్తిగా ఉంది. మ‌న తెలుగు సినిమా మ‌రోసారి అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకోవ‌డం గొప్ప విష‌యం. ఈ అవార్డు లభించడం గొప్ప విషయం. ర‌క్తం సినిమాలో మరచిపోలేనటువంటి పాత్రలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన చిత్ర ద‌ర్శ‌కులు రాజేష్ టచ్ రివర్‌కు, నిర్మాత సునీతా కృష్ణ‌న్, స‌హ నిర్మాత మునిషీ రైజ్ అహ్మ‌ద్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను అని అన్నారు.

Actor Benerjee: Raktham movie got International Award

గ‌తంలో ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్దా లాంటి ఎన్నో చిత్రాలను రూపొందించారు. వాటికి జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఆగ‌స్టు 13న అమెరికాలోని ఓహియో హ‌డ్సన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ర‌క్తం చిత్రం ప్ర‌ద‌ర్శింబ‌ప‌డుతుంది. అదే రోజు అవార్డు ప్ర‌దానోత్స‌వం కూడా ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కులు రాజేష్ ట‌చ్ రివ‌ర్, నిర్మాత సునీత కృష్ణ‌న్, స‌హ నిర్మాత మునిషీ రైజ్ అహ్మ‌ద్ , నేను హాజ‌ర‌వుతున్నాం అని తెలిపారు. మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) లో వైస్ ప్రెసిడెంట్ గా కొన‌సాగుతున్న బెర‌ర్జీని, ర‌క్తం ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్ రివ‌ర్, నిర్మాత సునీత కృష్ణ‌న్, స‌హ నిర్మాత మునిషీ రైజ్ అహ్మ‌ద్‌ను ఈ సంద‌ర్భంగా మా టీమ్ అంతా అభినందించారు.

English summary
Director Rajesh Touch River's Raktham movie got International award. Senior Actor Benerjee is the hero of the movie. This movie made back drop of Naxalite movement. Producer for this movie is Sunitha Krishnan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu