»   » నటుడు బ్రహ్మాజీ షాకింగ్ లుక్....(ఫోటోస్)

నటుడు బ్రహ్మాజీ షాకింగ్ లుక్....(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ తన షాకింగ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ లో పోస్టు చేసాడు. బిక్షగాడి అవతారంలో ఉన్న ఫోటోలను బ్రహ్మాజీ పోస్టు చేసాడు. ‘మై న్యూ లుక్. మేర్లపాక గాంధీ నన్ను ఇలా తయారు చేసారు. జూబ్లీహిల్స్ చెక్ పాయింట్ బెగ్గర్స్ అసోసియేషన్ నుండి కాస్టూమ్స్ వచ్చాయి. యువి క్రియేషన్స్ సినిమా కోసం ఈ లుక్' అని తెలిపారు.

Actor ‎Brahmaji‬ New Look In His Upcoming Movie

బ్రహ్మాజీ గురించిన వివరాల్లోకి వెళితే... బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. తండ్రి రెవిన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తండ్రి ఉద్యోగరీత్వా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు.

Actor ‎Brahmaji‬ New Look In His Upcoming Movie

చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులుకు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు. మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఏ.ఎం.ఐ.ఈ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది. ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు.

English summary
"My new look.. Styled by Merlapaka Gandhi ..costumes by Jubilhills checkpoint Beggar's association .. ‪#‎uvcreations‬" Brahmaji posted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu